మానవ అభివృద్ధిలో విద్య పాత్ర కీలకం
● వీఐటీలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
వేలూరు: మానవ అభివృద్ధిలో విద్య మరింత కీలకమని, విద్య ద్వారానే యువతకు విజ్ఞాన్ని అందించడంతో పాటు వారిలో మానవీయ విలువలను బయటకు తీయాల్సిన అవసరం ఉందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. వేలూ రు వీఐటీ యూనివర్సిటీ 40 సంవత్సరాల వీఐటీ ప్రస్థానం వేడుకలను వీఐటీ చాన్స్‌లర్ విశ్వనాథన్ అద్యక్షతన ఆయన ప్రారంభించారు. ముందుగా యూనివర్సిటీ ఆవరణలోనే సరోజిని నాయుడు భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 40 సంవత్సరాలుగా వీఐటీ యూనివర్సిటీని అంచలు అంచలుగా ప్రపంచమే తిరిగి చూసే స్థాయికి తీసుకు రావడం అభినందనీయమన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల మ ద్య అంతరాన్ని తగ్గించేందుకు యువత కృషి చేయా ల్సిన అవసరం ఉందన్నారు. ఈ దిశగా యువతను సన్నద్ధం చేయాల్సిన బాధ్యత యూనివర్శిటీలపై ఉందన్నారు. అవసరానికి మించి సాంకేతికతను వాడడం వల్ల అనేక శారీరక, మానసిక ఇబ్బందులు వస్తాయన్నారు. ప్రకృత్తిని ప్రేమించడం, ప్రకృత్తితో కలిసి జీవించడం అలవాటు చేసుకోవాలన్నారు. అదే విధంగా ఏ భషలో విద్యను అభ్యసించినా, ఎన్ని భాషలు నేర్చుకున్నా మాతృభాషను మాత్రం మరవరాదన్నారు. మంత్రి దురై మురుగన్ మాట్లాడుతూ చాన్స్‌లర్ విశ్వనాథన్ చిన్న వయస్సు నుంచే విద్యార్థి కమిటీ చైర్మన్‌గాను, పార్లమెంట్ సభ్యుని గా, ఎమ్మెల్యేగా గెలిచి ఇతరులకు ఆదర్శంగా నిలిచారన్నారు. చాన్స్‌లర్ విశ్వనాథన్ మాట్లాడుతూ 1984వ సంవత్సరంలో 180 మంది విద్యార్థులు, తొమ్మిది మంది అధ్యాపక బృందంతో ప్రారంభించిన వీఐటీని నేడు 44 వేల మంది విద్యార్థులకు విద్యనందించే స్థాయికి చేరడంపై హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 82 చెందిన విద్యార్థులు ఇక్కడ విద్యను అభ్యసిస్తున్నారని తెలిపారు. విద్యార్థులకు భారత జాతి గొప్పదనంపై అవగాహన కల్పించేందుకే పలువురి మేధావుల పేర్లను ఇక్కడి కట్టడాలకు పెడుతున్నామన్నారు. ప్రభుత్వా లు ఉచితాలను రద్దు చేసి విద్య మాత్రమే వారికి అందజేస్తే చాలన్నారు. అనంతరం మాజీ అధ్యాపక బృందం, మాజీ విద్యార్థులను అభినందించి సర్టిఫికెట్లును అందజేశారు. వీఐటీ ఉపాద్యక్షులు శంకర్, శేఖర్, జీవి సెల్వం, కాదంబరి విశ్వనాథన్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంద్య పెంటారెడ్డి, వైస్ చాన్స్‌లర్ కాంచన పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment