● ప్రయాణికుల ఇక్కట్లు
కొరుక్కుపేట: కొరుక్కుపేట వద్ద నీలగిరి ఎక్స్‌ప్రెస్ రైలు ఇంజన్ దెబ్బతింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఫలితంగా ఎలక్ట్రిక్ రైళ్లు ఆలస్యంగా నడిచాయి. వివరాలు.. మంగళవారం ఉదయం నీలగిరి ఎక్స్‌ప్రెస్ రైలు మేట్టుపాళయం నుంచి చైన్నె సెంట్రల్‌కు వచ్చింది. ప్రయాణికులు దిగారు. సరుకులను దించిన తర్వాత ఎక్స్‌ప్రెస్ రైలు ఇంజిన్‌ను ఎన్నూర్‌కు తీసుకెళ్లారు. కొరుక్కుపేట వద్ద వెళ్తుండగా డీజిల్ ఇంజన్ ఒక్కసారిగా చెడిపోయి ట్రాక్ మధ్యలో ఆగిపోయింది. దీంతో ఈ మార్గంలో వెళ్లే విద్యుత్ రైళ్లన్నీ నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సమాచారం అందుకున్న రైల్వే ఉద్యోగులు, అధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు. సిబ్బంది ఇంజిన్‌కు మరమ్మతు చేశారు. ఈ ఘటనతో ఈ మార్గాన్ని ఎన్నూరు మీదుగా సెంట్రల్, గమ్మిడిపూండి తదితర ప్రాంతాలకు మళ్లించారు. సూళ్లూరుపేట వెళ్లే సబర్బన్ ఎలక్ట్రిక్ రైళ్లు అక్కడక్కడా నిలిచిపోయాయి. గుమ్మిడిపూండి నుండి వచ్చే అన్ని రైళ్లు ఎన్నూర్ రైల్వే స్టేషన్‌కు చేరుకునే ముందు ఆపివేయబడ్డాయి. దీంతో ప్రయాణికులు, పాఠశాల, కళాశాల విద్యార్థులు సమయానికి వెళ్లలేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment