● మదురై హైకోర్టులో ప్రభుత్వం వెల్లడి
సేలం : మదురైకి చెందిన రామ్‌కుమార్ అనే వ్యక్తి మదురై హైకోర్టులో గతంలో ఓ ప్రజా ప్రయోజన వాజ్యాన్ని దాఖలు చేశారు. ఈ క్రమంలో 2016 సంవత్సరం హైకోర్టు తిరుకురళ్‌లో ఉన్న కొంత భాగాన్ని 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు పాఠ్యాంశంలో చేర్చాలి అని ఉత్తర్వులు చేసింది. ఈ మేరకు 2017వ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వ వెల్లడించిన ప్రకటనలో 1050 తిరుకురల్ పద్యాలను చేర్చాలని ప్రభుత్వం వెల్లడింది. అయితే ఆ ఉత్తర్వులు అమలుకు మాత్రం నోచుకోలేదు. దీంతో వెంటనే వాటిని ఆయా తరగతి పా ఠ్యాంశాలలో ఉండే విధంగా ఉత్తర్వులు చేయాలని, మరోసారి పిటిషన్ దాఖలు చేశారు. పరీక్షల్లో కూడా ప్రశ్నలుగా ఉండాలని కోరారు. ఈ పిటిషన్ న్యాయమూర్తులు ఎంఎస్ రమేష్, మరియాక్లాట్ బెచ్ ముందు మంగళవారం విచారణకు వచ్చింది. అప్పుడు ప్రభుత్వం తరపున అన్ని తరగతులలోను తిరుకురళ్ పాఠ్యాంశంగా చేర్చామని, తిరుకురళ్‌తో పాటు దాని తాత్పర్యం, సారాంశం కూడా పాఠ్యాంశాలలో పొందుపరిచినట్లు పేర్కొన్నారు. పరీక్షల్లో ప్రశ్నలుంటాయని వివరించారు. వారి వ్యాఖ్యలను నమోదు చేసుకున్న న్యాయమూర్తులు ఈ కేసును ముగిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment