– ఘాట్‌లో విరిగిపడిన కొండచరియలు, చెట్లు
తిరుమల : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో తిరుమలలో రెండు రోజులుగా వర్షం కురుస్తోంది. వర్షం ప్రభావంతో రెండో ఘాట్ రోడ్డులోని రెండో మలువు వద్ద రోడ్డుకు అడ్డంగా కొండచరియలు, విరిగిపడ్డాయి. వృక్షాలు కూలాయి. దీంతో కొంత సమయం ట్రాఫిక్ అంతరాయం కలిగింది. వెంటనే స్పందించిన ఘాట్ రోడ్డు భద్రతా సిబ్బంది, అటవీశాఖ సిబ్బంది రోడ్డుపై పడిన కొండచరియలు, చెట్లను తొలగించి వాహన రాకపోకలను పునరుద్ధరించారు. అలిపిరి వద్ద ఎప్పటికప్పుడు వాహన చోదకులను అప్రమత్తం చేసి, ఘాట్‌రోడ్డులో పంపుతున్నారు. టీటీడీ ఇంజినీరింగ్ అధికారులు ఘాట్ రోడ్డు పరిస్థితులపై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సిబ్బందికి సూచనలు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment