రూ.3.80 కోట్లతో విశ్రాంతి భవనం
తిరుత్తణి: ఆర్కాడుకుప్పంలో రూ.3.80 కోట్ల వ్యయంతో తిరుమలకు పాదయాత్రగా వెళ్లే భక్తుల సౌకర్యార్థం విశ్రాంతి భవనానికి సీఎం స్టాలిన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బుధవారం పనులకు శ్రీకారం చుట్టారు. గత ఏడాది నిర్వహించిన అసెంబ్లీ సమావేశాల్లో చైన్నె నుంచి తిరుపతికి స్వామి దర్శనానికి కాలినడకన వెళ్లే భక్తుల సౌకర్యార్ధం తిరుత్తణి సుబ్రహ్యణ్యస్వామి ఆలయ నిధుల నుంచి విశ్రాంతి భవనం నిర్మించనున్నట్లు హిందూదేవదాయశాఖ మంత్రి శేఖర్‌బాబు ప్రకటన చేశారు. ఈక్రమంలో విశ్రాంతి భవనం నిర్మాణానికి సంబంధించి తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి అనుబంధంలోని చైన్నె–తిరుపతి జాతీయ రహదారిలోని ఆర్కాడుకుప్పం చోళీశ్వరస్వామి ఆలయానికి సొంతమైన స్థలంలో భక్తుల విశ్రాంతి భవనానికి స్థలం ఎంపిక చేశారు. రూ.3.80 కోట్లతో నిర్మించనున్న విశ్రాంతి భవనం పనులకు సీఎం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఆర్కాడుకుప్పంలో భూమిపూజలో తిరువళ్లూరు ఎమ్మెల్యే రాజేంద్రన్ పాల్గొని పనులకు సంబంధించిన భూమి పూజలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment