యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి
తిరువళ్లూరు: యూనియన్ పరిధిలోని పెండింగ్ పనులను యుద్ధప్రాతిపదికన పది రోజుల్లో పూర్తిచేయాలని తిరువళ్లూరు యూనియన్ చైర్పర్సన్ జయశీలి అధికారులు, కౌన్సిలర్లను ఆదేశించారు. తిరువళ్లూరు యూనియన్ కౌన్సిల్ పదవీ కాలం డిసెంబర్ 31 నాటికి ముగియనున్న క్రమంలో చివరి సమావేశం బుధవారం ఈకాడు బీడీఓ కార్యాలయంలో చైర్పర్సన్ జయశీలి అధ్యక్షతన జరిగింది. ఆమె మాట్లాడుతూ గత ఐదేళ్లలో చైర్‌పర్సన్‌గా నిష్పక్షపాతంగా విధులు నిర్వహించానని, నిధుల కేటాయింపులోనూ సమ న్యాయం పాటించినట్టు తెలిపారు. డిసెంబర్ 31తో తన పదవీ కాలం ముగుస్తుందని, తిరువళ్లూరు యూనియన్ను అన్ని విధాల శక్తివంచన లేకుండా అభివృద్ధి చేశామని చెప్పారు. కౌన్సిలర్లు, అధికారుల సహకారాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటానన్న ఆమె, పెండింగ్ పనులను యుద్ధ ప్రాతిపధికన పూర్తిచేయాలని ఆదేశించారు. వైస్ చైర్మన్ బర్గతుల్లా, బీడీఓలు, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment