తిరువొత్తియూరు: చైన్నె పల్లావరం సమీపంలో వాహనం పార్కింగ్ చేసే విషయంపై చోటు చేసుకున్న గొడవలో దుకాణ యజమానిపై దాడి చేసిన పీఎంకే నాయకుడు, అతడి కుటుంబ సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. పల్లావరం సమీపంలోని మొలిచాలూరు ప్రధాన రోడ్డులో చరణ్ రాజుఇంటికి అవసరమైన వస్తువులు విక్రయ దుకాణం నడుపుతున్నాడు . ఇతను అక్టోబర్ 29న తన దుకాణము తెరిచి వ్యాపారము చేస్తున్నాడు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన మొలిచులూరు పంచాయతీ వార్డు సభ్యుడు, పీఎంకే నాయకుడు సురేష్ బైకును చరణ్ రాజు దుకాణం ముందు నిలిపాడు. బైకును పక్కకు పెట్టమని దుకాణం యజమాని కోరాడు. దీంతో చరణ్‌రాజ్‌కు సురేష్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తర్వాత సురేష్ తన భార్య, బంధువులతో కలిసి దుకాణ యజమాని చరణ్ రాజుపై తీవ్రంగా దాడి చేశారు. ఇందులో గాయపడిన చరణ్ రాజ్ శంకర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు .దీని మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దీనికి సంబంధించి పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. పరారీ లో ఉన్న పిఎంకె ప్రముఖుడు సురేష్ అతని భార్య బంధువు బంధువును కోసం గాలిస్తూ గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో మంగళవారం అదే ప్రాంతంలో సురేష్ ను అతని భార్య, బంధువు ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment