అన్నానగర్: పోరూరులోని ఓ ప్రైవేట్ కళాశాల హాస్టల్‌లో బుధవారం తెల్లవారుజామున వైద్య విద్యార్థి ఉరివేసుకుని మృతిచెందిన ఘటన సంచలనం సృష్టించింది. నామక్కల్ జిల్లా కుమారపాళయంకు చెందిన రిషికేశ్ (18). పోరూరులోని ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఈక్రమంలో బుధవారం తెల్లవారుజామున కాలేజీ హాస్టల్ గదిలో రిషికేశ్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోరూరు పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కీల్పాక్కం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసుల విచారణలో రిషికేశ్ మూడేళ్లుగా కుమారపాలైయానికి చెందిన యువతిని ప్రేమిస్తున్నాడు. పోరూర్‌లో ఉన్న ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరంలో చేరిన తన ప్రియురాలిని కలవలేకపోయానని మనస్తాపం చెందాడు. ప్రియురాలు ఇటీవల సెల్‌ఫోన్ మాట్లాడడం మానేసిందని తెలిసింది. దీంతో మనస్తాపానికి గురైన రిషికేశ్ హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Comments
Please login to add a commentAdd a comment