క్లుప్తంగా | - | Sakshi
Sakshi News home page

క్లుప్తంగా

Published Thu, Nov 14 2024 9:14 AM | Last Updated on Thu, Nov 14 2024 9:14 AM

క్లుప్తంగా

క్లుప్తంగా

క్రికెట్‌ ఆడుతూ జవాన్‌ మృతి

తిరువొత్తియూరు: తేని జిల్లా కంభం సమీపంలో ఉన్న కన్నుడయన్‌ కాలని ప్రాంతానికి చెందిన పర మన్‌ కుమారుడు పాల్‌ పాండి (28) ఆర్మీలో జవాన్‌గా పనిచేస్తున్నారు. నెల రోజులకు సెలవు తీ సుకుని సొంత ఊరికి వచ్చారు. ఈ క్రమంలో సరదాగా తన స్నేహితులతో కలిసి మైదానంలో క్రికె ట్‌ ఆడుతూ గుండెపోటుకు గురై పడిపోయాడు. వెంటనే అతన్ని స్నేహితులు మోటార్‌ సైకిల్‌ పై కంభం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువచ్చారు. అక్కడ చికిత్స పొందుతూ పాల్‌ పాండి మృతి చెందారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇతడు వివాహం కోసం సంబంధాలు చేసేందుకు సెలవుపై ఇంటికి వచ్చినట్లు తెలిసింది.

శిక్షణ పొందుతూ ఎస్‌ఐ..

తిరువళ్లూరు: ఆవడి కమిషనరేట్‌ కార్యాలయంలో స్పెషల్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా పనిచే స్తూ శిక్షణ తీసుకుంటున్న అధికారి స్పృ హతప్పి కిందపడగా వైద్యశాలకు తరలించే క్రమంలో మృతిచెందిన సంఘటన విషాదాన్ని నింపింది. వేలూరు జిల్లా జోలార్‌పేటకు చెందిన ప్రభాకరన్‌(53). ఇతను 1997వ సంవత్సరంలో పోలీసు శాఖలో సెకండరీ గ్రేడ్‌ కానిస్టేబుల్‌ పోస్టుకు ఎంపికయ్యారు. ఇతడికి భార్యతో పాటు కుమారుడు, కుమార్తె ఉన్నారు. ప్రస్తుతం ఈయన కుటుంబంతో కలసి పట్టాభిరామ్‌ పోలీసు క్వార్టర్స్‌లో నివాసం వుంటున్నారు. తిరువళ్లూరు జిల్లా ఆవడి పోలీసు కమిషనరేట్‌లో సీసీబీ విభాగంలో స్పెషల్‌ సబ్‌ ఇన్పెక్టర్‌గా ప్రభాకరన్‌(53) విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల స్పెషల్‌ సబ్‌ఇన్పెక్టర్‌ స్థాయి(ఎస్‌ఎస్‌ఐ) నుంచి రెగ్యులర్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా పదోన్నతి పొంది కమిషనరేట్‌లో శిక్షణ తీసుకుంటున్నారు. ఈ క్రమంలో బుధవారం యథావిధిగా ఏడు గంటలకు శిక్షణకు హాజరైన క్రమంలో హఠాత్తుగా స్పృహతప్పి కిందపడిపోయాడు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఆవడి ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు.

దర్శనానికి వెళుతూ కానరాని లోకాలకు..

తిరువళ్లూరు: అమ్మవారి దర్శనానికి వెళుతూ స్ప్పహతప్పి కిందపడ్డ వృద్ధుడిని వైద్యశాలకు తరలిస్తుండగా మృతిచెందాడు. చైన్నె మైలాపూర్‌కు చెందిన నరసింహన్‌ కుమారుడు జయగోపాల్‌(60). ఇతను కుటుంబసభ్యులతో కలసి పెద్దపాళ్యం భవాని అమ్మవారి దర్శనం కోసం వచ్చినట్టు తెలిసింది. మంగళవారం రాత్రి స్థానికంగా వున్న లాడ్జీలో వుంటూ ఉదయం ఆలయానికి బయలుదేరారు. ఈక్రమంలో హఠాత్తుగా ఫిట్స్‌ రావడంతో అప్రమత్తమైన కుటుంబసభ్యులు స్థానికంగా వున్న ప్రయివేటు వైద్యశాలకు తరలించారు. అక్కడ ప్రాతమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం చైన్నె రాజీవ్‌గాంధీ ప్రభుత్వ వైద్యశాలకు తరలిస్తుండగా మృతిచెందాడు. అమ్మవా రి దర్శనం కోసం వచ్చిన వృద్ధుడు హఠాత్తుగా మృతి చెందిన సంఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.

ట్రాక్టర్‌ బోల్తా: విద్యార్థి దుర్మరణం

అన్నానగర్‌: ట్రాక్టర్‌ బోల్తా పడి ఓ విద్యార్థి దుర్మరణం చెందాడు. చెంగల్పట్టు జిల్లా అచ్చరపాక్కం పక్కనే ఉన్న ఎలప్పక్కం గ్రామంలో విద్యుత్‌ స్తంభాలను నాటడానికి అచ్చరపాక్కం విద్యుత్‌ బోర్డు కార్యాలయం నుంచి ఆరు విద్యుత్‌ స్తంభాలను ట్రాక్టర్‌లో తీసుకెళ్లారు. మంగళవారం సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేందుకు అచ్చరపాక్కం ప్రభుత్వ పాఠశాలలో 11వ తరగతి చదువుతున్న కట్టక్కరుణి ప్రాంతానికి చెందిన రోహిత్‌ (16), తిమ్మవరం ప్రాంతానికి చెందిన అభిషేక్‌ (16), కిషోర్‌కుమార్‌ (16) లిఫ్ట్‌ అడిగి ట్రాక్టర్‌ ఎక్కారు. ఆ కాలనీలో వెళుతుండగా ట్రాక్టర్‌ అదుపుతప్పి పక్కనే ఉన్న కాలువలో బోల్తా పడింది. ట్రాక్టర్‌ లో ప్రయాణిస్తున్న పాఠశాల విద్యార్థులు అభి షేక్‌, రోహిత్‌, కిషోర్‌కుమార్‌, ట్రాక్టర్‌ డ్రైవర్‌ అశోక్‌ విద్యుత్‌ స్తంభాల మధ్య ఇరుక్కుని తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న అచ్చరపాక్కం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని గాయపడ్డ వారిని చెంగల్‌పట్టు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ అభిషేక్‌ చికిత్స పొందుతూ మృతిచెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఇద్దరు ఖైదీల ఆత్మహత్యాయత్నం

తిరువొత్తియూరు: పాళయం సెంట్రల్‌ జైలులో పా ళయం కృష్ణాపురానికి చెందిన ముత్తయ్య, కోవిల్‌ పట్టి ప్రాంతానికి చెందిన విగ్నేష్‌ విచారణ ఖైదీలు గా ఉన్నారు. వీరు బుధవారం సెంట్రల్‌ జైల్లో తమ చేతులను ఇనుప ముక్కతో కోసుకొని ఆత్మహత్య కు ప్రయత్నించారు. ఇది చూసిన అక్కడున్న వార్డన్‌లు వారిని సెంట్రల్‌ జైలులోని ఆసుపత్రికి తరలించారు. ఈమేరకు వారికి చికిత్స అందిస్తున్నారు.

ఐటీ ఉద్యోగి ఆత్మహత్య

అన్నానగర్‌: ఐటీ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డా డు. చైన్నెలోని పురసైవాక్కం వెల్లాల వీధికి చెంది న చరణ్‌కుమార్‌ (32). ఇతని తండ్రి కుమార్‌, త ల్లి ఉషారాణి. ఐటీ ఉద్యోగి అయిన చరణ్‌కుమార్‌ ఆన్‌లైన్‌లో జూదం ఆడేందుకు ఆసక్తి చూపుతూ బిట్‌కాయిన్‌లో పెట్టుబడులు పెట్టాడు. ఈ నేపథ్యంలో బుధవారం చరణ్‌కుమార్‌ తండ్రి, తల్లి ఇ ద్దరూ వాణియంబాడి వెళ్లారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న చరణ్‌కుమార్‌ తన స్నేహితురాలికి వాట్సాప్‌ ద్వారా మెసేజ్‌ పంపాడు. షాక్‌ తిన్న స్నేహితురా లు వెంటనే చరణ్‌కుమార్‌ ఇంటికి వెళ్లింది. అక్కడ చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న చరణ్‌కుమార్‌ మృతదేహాన్ని చూసి దిగ్భ్రాంతి చెందింది. అనంతరం ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే వచ్చిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పోలీసుల విచారణలో చరణ్‌కుమార్‌ రూ.60 లక్షల వరకు అప్పులు తీసుకుని ఆన్‌లైన్‌ గ్యాంబ్లింగ్‌, బిట్‌కాయిన్‌లో పెట్టుబడి పెట్టాడు. ఇందులో నష్టం ఏర్పడింది. చేసిన అప్పు తీర్చలేక మనస్తాపంతో చరణ్‌కుమార్‌ ఆత్మహత్య చేసుకున్నట్లు విచారణలో తేలింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement