బలహీన పడ్డ ద్రోణి
● పలు జిల్లాల్లో వానలు ● పనులను పరిశీలించిన మంత్రి నెహ్రూ
సాక్షి, చైన్నె: బంగాళాఖాతంలో నెలకొన్న అల్పపీడనం మరింతగా బలహీన పడింది. అయినా, కొన్ని జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. ఇక మంగళవారం చైన్నె, శివారులలో అనేక చోట్ల భారీ వర్షం కురిసింది. ఈ ద్రోణి తమిళనాడు వైపుగా కదిలింది. దీంతో మరింతగా చైన్నె, శివారు జిల్లాలకు వర్షాలు ఎదురు చూడ వచ్చని వాతావరణ కేంద్రం ప్రకటించింది. అయితే, బుధవారం అక్కడక్కడా చిరు జల్లుల వర్షంకురవడంతో వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. ఈ ద్రోణి మరింతగా బలహీన పడినట్టు వాతావరణ కేంద్రం ప్రకటించినా, మరో మూడురోజులు వర్షాలు అనేక జిల్లాలో కొనసాగనున్నాయి. బుధవారం కడలూరు, విల్లుపురం, కళ్లకురిచ్చి తంజావూరు, మైలాడుతురై, తిరువారూర్ జిల్లాలతో పాటు పుదుచ్చేరిలో అనేక చోట్ల మోస్తారుగా వర్షం కురిసింది. మరికొన్ని చోట్ల భారీగానే వర్షం కురిసింది. సముద్రంలో అలల తాకిడి అధికంగా ఉండటంతో తీర వాసులను అప్రమత్తం చేశారు. గడిచిన 24 గంటలలో నాగపట్నం శీర్గాలిలో అత్యధికంగా 13 సెం.మీ వర్షంకురిసింది. తిరువారూర్‌లో వర్షం దాటికి 50 ఎకరాల వరి పంట నీటమునిగింది. మదురైలో అయితే వైగై నదీలో నీటి ఉధృతి పెరగడంతో తీర వాసులను అలర్ట్ చేశారు. అనేక చోట్ల నదీ జలాలు రోడ్లమీదకు రావడంతో అవస్థలు తప్పలేదు. ఇక చైన్నెలో వర్షాలను ఎదుర్కొనే విధంగా చేసిన ఏర్పాట్లు, జరుగుతున్న పనులను నగరాభివృద్ధి శాఖమంత్రి కేఎన్ నెహ్రూ పరిశీలించారు. 329 శిబిరాలు, 36 పడవలను చైన్నెలోని లోతట్టు ప్రాంతాలలో సిద్ధంగ ఉంచామని మంత్రి ప్రకటించారు. అతి భారీ వర్షాలు కురిసిన పక్షంలో సేవలు అందించేందుకు 18 వేల మంది స్వచ్ఛంద సేవకులకు కూడా సిద్ధంగా ఉన్నారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment