భక్తులకు వసతులు సిద్ధం చేయండి
● బ్రహ్మోత్సవాలకు 3,408 ప్రత్యేక బస్సులు ● వంద ప్రత్యేక వైద్యశిబిరాలు ● మంత్రులు ఏవావేలు, శేఖర్‌బాబు
వేలూరు: తిరువణ్ణామలై అరుణాచలేశ్వరాలయ కార్తీక బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు అన్ని వసతులు కల్పించడంతో పాటు 3,408 ప్రత్యేక బస్సులు నడపాలని మంత్రులు ఏవావేలు, శేఖర్‌బాబు అధికారులను ఆదేశించారు. కార్తీక బ్రహ్మోత్సవాలు డిసెంబర్ 4వ తేదీ నుంచి పదిరోజుల పాటు జరగనున్నాయి. ఉత్సవాల్లో ఆఖరి రోజు 13వ తేదీన మహాదీపోత్సవం జరగనుంది. ఉత్సవాలను తిలకించేందుకు 45 లక్షల మంది భక్తులు తిరువణ్ణామలై చేరుకోనున్నారు. దీంతో ముందస్తు ఏర్పాట్లపై మంత్రులు ఏవా వేలు, శేఖర్‌బాబు అధికారులతో సమావేశం నిర్వహించారు. మంత్రి ఏవావేలు మాట్లాడుతూ అన్ని వసతులు కల్పించడంతోపాటు, పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు.
మాడ వీధుల్లో పది రోజులపాటు స్వామివారి వాహనాలు భక్తులకు దర్శనం ఇవ్వనున్న నేపథ్యంలో వెంటనే మాడ వీధుల్లోని మొత్తం ఆక్రమణలు తొలగించాలన్నారు. పట్టణంలో 24 ప్రాంతాల్లో తాత్కాలిక బస్టాండ్‌లు ఏర్పాటు చేసి పట్టణంలో ట్రాఫిక్ సమస్య లేకుండా చూడాలన్నారు. అదేవిధంగా వందచోట్ల వైద్య శిబిరాలు, అక్కడక్కడ అగ్నిమాపక వాహనాలు సిద్ధంగా ఉంచాలన్నారు. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పిచ్చాండి, ఎంపీ అన్నాదురై, ఎమ్మెల్యేలు గిరి, శరవణన్, కలెక్టర్ భాస్కరపాండియన్, ఎస్పీ సుధాకర్, దేవదాయశాఖ అదనపు కమిషనర్ సుకుమార్, దేవదాయ శాఖ జిల్లా చైర్మన్ జీవానందం, ఆలయ జాయింట్ కమిషనర్ జ్యోతి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment