నాణ్యమైన ఆహారాన్ని తీసుకోవాలి
తిరువళ్లూరు: నాణ్యమైన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలని అనారోగ్యానికి అవసరమైన మందు ఆఽహారం ద్వారా లభిస్తుందని తిరువళ్లూరు ఫుడ్ సేఫ్టీ అధికారి సుభాష్ చంద్రబోస్ వివరించారు. తమిళనాడు ఫుడ్ సేఫ్టీ, డ్రగ్స్ విభాగం ఉమ్మడిగా నాణ్యమైన ఆహారం తీసుకోవడంతోపాటు ఆహారంలో పోషకాలపై అవగాహన కల్పించే కార్యక్రమం ఎల్లాపురంలోని ప్రభుత్వ పాఠశాలలో జరిగింది. కార్యక్రమానికి తిరువళ్లూరు జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి సుభాష్‌చంద్రబోస్ హాజరై ప్రసంగించారు. నాణ్యమైన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలని, జంక్‌ఫుడ్‌కు దూరంగా వుండాలని పిలుపునిచ్చారు. కల్తీలేని ఆహారం తీసుకోవడంవల్ల మనిషిలో వుండే అనారోగ్యానికి మందుగా కూడా ఉపయోగపడుతుందన్నారు. అనంతరం నాణ్యమైన ఆహారంపై విద్యార్థులకు క్విజ్ పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. పాడి పరిశ్రమ టెక్నికల్ కళాశాల ప్రిన్సిపల్ కుమరవేలు, అసిస్టెంట్ ప్రొఫెసర్‌లు మాతంగి, నిత్యాలక్ష్మి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment