అనాగరిక విమర్శలు వద్దు
● కేడర్‌కు విజయ్ సూచన ● చిన్నమ్మ కీలక వ్యాఖ్యలు
సాక్షి, చైన్నె: అనాగరిక వ్యాఖ్యలతో ఎవ్వర్నీ విమర్శించ వద్దని కేడర్, నాయకులకు తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్ సూచించారు. ఈ మేరకు రాజకీయంగా నాగరిక అంశాలతో ఎలా విమర్శించాలో అన్న విషయంగా నాయకులకు శిక్షణ ఇవ్వడానికి నిర్ణయించినట్టు తెలుస్తోంది. వివరాలు..విజయ్‌ను ఇటీవల కాలంగా నామ్ తమిళర్ కట్చి నేత సీమాన్‌తోపాటు కొందరు తీవ్ర స్థాయిలో విమర్శించడమే కాకుండా వ్యాఖ్యల తూటాలను పేల్చుతున్నారు. ఇది విజయ్ అభిమానులు, తమిళగ వెట్రి కళగం వర్గాలలో ఆగ్రహాన్ని రేపుతోంది. దీంతో పోస్టర్లతో వ్యాఖ్యల తూటాలు, ఎదురు దాడిచేస్తున్నారు. కొందరు అయితే, బహిరంగంగానే తమ మీద విమర్శలు చేస్తున్న వారిపై ఎదురు దాడి తో తూటాలను పేల్చుతున్నారు. ఇది కాస్త అనాగరికంగా మారుతుండటంతో విజయ్ అలర్ట్ అయ్యారు. నాగరిక రాజకీయం చేయడానికి వచ్చామని, ఆ దిశగానే ముందుకెళ్దామని నేతలకు సూచిస్తూ ఆయన లేఖ రాసి ఉన్నారు. ఇందులో పలు అంశాలను ప్రస్తావిస్తూ అనాగరిక వ్యాఖ్యలు, విమర్శలు వద్దే వద్దు అని, రాజకీయం నాగరికంగా ఉండే విధంగా ముందుకెళ్దామని, అదే తమిళ వెట్రి కళగంకు బలాన్ని చేకూరుస్తుందని నేతలకు సూచించడం గమనార్హం.ఇ దిలా ఉండగా, రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో విజయ్‌కు ప్రజల మద్దతు తప్పకుండా కనిపిస్తుందని దివంగత సీఎం జే జయలలిత నెచ్చెలి, చిన్నమ్మశశికళ వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆమె తూత్తుకుడిలో మీడియాతో మాట్లాడుతూ, నటుడు విజయ్‌కి ప్రజల మద్దతు 2026 ఎన్నికలలో కనిపిస్తుందని వ్యాఖ్యలు చేశారు. 2026 ఎన్నికల కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని, రాజకీయాలు, పరిస్థితులకు అనుగుణంగా ఈ ఎన్నికలు కీలకం పరిణామాలకు దారి తీస్తాయని అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment