అక్షయ పాత్రతో బీడబ్ల్యూ ఎల్‌పీజీ ఒప్పందం
సాక్షి, చైన్నె: అక్షయ పాత్ర ఫౌండేషన్ ద్వారా అందించే మధ్యాహ్న భోజనం తయారీకి అవసరమయ్యే గ్యాస్‌ను బీడబ్ల్యూ ఎల్‌పీజీ అందజేయనుంది. ఈ మేరకు స్థానికంగా ఒప్పందాలు జరిగాయి. అధునాతన కిచెన్ టెక్నాలజీలతో పోషకాహారం, విద్యా ఫలితాలను బలోపేతం చేయడం లక్ష్యంగా అక్షయ పాత్ర ఫౌండేషన్ పాఠశాలలలో పిల్లలకు మధ్యాహ్న భోజనం అందజేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. 2,200 కంటే ఎక్కువ పాఠశాలలకు చెందిన 12 మిలియన్ల పిల్లలకు మధ్యాహ్న భోజనం తయారు చేసి అందిస్తూ వచ్చారు. ఈ సంఖ్య 2024–25 ఆర్థిక సంవత్సరంలో 42.7 మిలియన్లకు చేరింది. అదనంగా మూడు కిచెన్‌లను సైతం ఏర్పాటు చేశారు. ఈతయారీకి మరింత బలోపేతం దిశగా గ్యాస్ సరఫరాకు బీడబ్ల్యూ ఎల్‌పీజీ ముందుకు వచ్చింది. బిడబ్ల్యూ ఎల్‌పీజీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చైర్మన్ క్రిస్టియన్ సోరెన్సెన్ మాట్లాడుతూ, అక్షయ పాత్రకు ఎనర్జీ పార్టనర్‌గా ఉండడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. పిల్లలకు మధ్యాహ్న భోజనాన్ని సకాలంలో తయారు చేసి అందించే వంట శాలలో తమ సహకారం ఉంటుందన్నారు. అక్షయ పాత్ర ఫౌండేషన్‌లో చీఫ్ రిసోర్స్ మొబిలైజేషన్ – మార్కెటింగ్ ఆఫీసర్ ధనంజయ్ గంజూ మాట్లాడుతూ, ఈ భాగస్వామ్యం మానవతా ప్రయత్నాలకు కూడా విస్తరించిందన్నారు. అత్యాధునిక సాంకేతికత వనరులను మరింతగా పెంచుతుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment