చిరు వ్యాపారులకు.. ప్రోత్సాహం | - | Sakshi
Sakshi News home page

చిరు వ్యాపారులకు.. ప్రోత్సాహం

Published Thu, Nov 14 2024 9:18 AM | Last Updated on Thu, Nov 14 2024 9:18 AM

చిరు

చిరు వ్యాపారులకు.. ప్రోత్సాహం

సాక్షి, చైన్నె : రాజధాని నగరం చైన్నెలోని కోయంబేడు వద్ద అతిపెద్ద మార్కెట్‌ ఉన్న విషయం తెలిసిందే. ఇక్కడికి రోజూ వందలాది వాహనాల్లో సరకులు వివిధ రాష్ట్రాల నుంచి వస్తుంటాయి. ఇక్కడి నుంచి చిల్లర వర్తకులు, కిరాణ దుకాణదారులు వస్తువులు, కూరగాయలను కొనుగోలు చేసి తీసుకెళ్తుంటారు. వ్యాపారులకే కాదు, నగర, శివారుల్లోని ప్రజలందరూ ఇక్కడికి వచ్చి తమకు కావాల్సిన అన్ని రకాల వస్తువుల్ని కొంటుంటారు. ఇక్కడ చిరు వర్తకుల సంఖ్య భారీగా ఉంటుంది. టోకు వర్తకుల నుంచి పండ్లు , కూరగాయలు వంటి వాటిని వీరు కొనుగోలు చేసి ఆ పరిసరాలలో విక్రయిస్తున్నారు. వీరంతా రోజు వారి తమ వ్యాపారం కోసం కంతు వడ్డీ, స్పీడ్‌వడ్డీ ఇచ్చే వారిని ఆశ్రయించాల్సి ఉండేది. కొందరు అయితే, ఉదయం అప్పు తీసుకుని , రాత్రి సమయంలో ఒక రోజువడ్డీతో తిరిగి చెల్లిస్తుంటారు. అధిక వడ్డీల కారణంగా చిరు వర్తకులకు మిగిలేది కన్నీళ్లు, గతంలో కంతు వడ్డీదారుల వేధింపులు భరించలేక చిరు వర్తకులు బలవన్మరణాలకు సైతం పాల్పడిన సందర్భాలు ఉన్నాయి. ఇక నష్టాలు, కష్టాల బారిన పడే మరెందరో రాత్రికి రాత్రే చెప్పపెట్టకుండా మకాం మార్చేసి ఏమయ్యారో అన్నట్టుగా పరిస్థితులు ఉండేవి.

టాడ్కో అప్పన్న హస్తం..

తమిళనాడులో ఆది ద్రావిడర్‌లకు గృహ నిర్మాణాలు లక్ష్యంగా ఏర్పాటైన టాడ్కో ప్రస్తుతం చిరు వర్తకులకు ఆపన్నహస్తం అందిస్తోంది. గత ఏడాది చైన్నె కోయంబేడులో టాడ్కో ద్వారా ప్రయోగాత్మకంగా రుణ పంపిణీకి చర్యలు తీసుకున్నారు. ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన చిరు వర్తకులకు ఈ రుణాలను అందజేశారు. వీరు టోకు వర్తకుల నుంచి వస్తువులను కొనుగోలు చేసి ఆ పరిసరాలలో, తోపుడు బండ్లు లేదా రోడ్డు పక్కగా పుట్‌ఫాత్‌ తదితర ప్రాంతాలలో చిరు వర్తకంతో పండ్లు, పువ్వులు, కూరగాయలను అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. జాతీయ ఎస్సీ, ఎస్టీ విభాగం తరపున 4 శాతం, టాడ్కో ద్వారా 2.5 శాతం అంటూ మొత్తంగా 6.5 శాతం వడ్డీతో రూ. 1.25 లక్షల చొప్పున ఒక్కో చిరు వర్తకుడికి అంటూ మొత్తంగా 46 మందికి తొలి విడతలో అందజేశారు. రెండవ విడతగా 69 మంది, మూడవ విడతగా 74 మంది అంటూ ఇప్పటి వరకు 250 మంది చిరు వర్తకులకు రుణాలను టాడ్కో అందజేసింది. చైన్నెలో రుణ ప్రయోగం విజయవంతం కావడంతో చిరు వర్తకులకు ఆత్మహత్యలు తగ్గాయని చెప్పవచ్చు. కష్టాలతో రాత్రికి రాత్రే మకాం మార్చే వాళ్లూ ప్రస్తుతం లేరు. ఈ రుణం చెల్లింపునకు మూడేళ్ల కాల పరిమితి ఉన్నా, త్వరితగతిన చెల్లించి మళ్లీ రుణాలు తీసుకునే చిరు వర్తకులు అధికంగానే ఉన్నారు.

చిరు వర్తకుల సంక్షేమమే ధ్యేయంగా తమిళనాడు ఆదిద్రావిడర్‌ హౌసింగ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌(టాడ్కో–టీఏహెచ్‌డీసీఓ) రుణ సేవలను విస్తృతం చేయాలని నిర్ణయించింది. తక్కువ వడ్డీతో రుణాలు భారీ ఎత్తున అందించేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. మదురై, తిరుచ్చి వంటి నగరాలలోని అతిపెద్ద మార్కెట్లలోని ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన చిరు వర్తకులకు రుణాలను అందించనుంది. కాగా ప్రస్తుతం చైన్నెలో అమలులో ఉన్న ఈ రుణ పథకాన్ని కేంద్రం సైతం పరిశీలిస్తున్నట్లు సమాచారం.

రుణసాయంతో ఆపన్నహస్తం

మరింత విస్తృతం కానున్న టాడ్కో సేవలు

మదురై, తిరుచ్చి తదితర మార్కెట్‌ ప్రాంతాలకు విస్తరణ

విస్తరణకు నిర్ణయం..

కోయంబేడులో విజయవంతంగా సాగుతున్న టాడ్కో రుణ సేవను మదురైలోని మాట్టుథావని మార్కెట్‌, దిండుగల్‌ ఒట్టన్‌ చత్రం మార్కెట్‌, తిరుచ్చి తదితర జిల్లాలోని అతి పెద్ద మార్కెట్లలోని చిరు వర్తలకు ఆపన్నహస్తం అందించేందుకు టాడ్కో వర్గాలు సిద్ధమయ్యాయి. ఈ రుణ సేవను విస్తృతం చేయడానికి కార్యాచరణ రూపకల్పన చేశారు. మలి విడతగా తొలుత మదురై మార్కెట్‌, తదుపరి నెలల వ్యవధిలో అన్ని మార్కెట్లలోని చిరు వర్తలకు ముఖాలలో చిరునవ్వులు లక్ష్యంగా, వారి ఆర్థిక పరిస్థితి మెరుగు కోసం రుణాలను విస్తృతంగా అందించబోతున్నారు. రూ. 100 కోట్ల రుణాల పంపిణీ దిశగా టాడ్కో వర్గాలు కసరత్తులు చేసి ఉన్నాయి. టాడ్కో ద్వారా లేదా జైభీం కార్మి, చిరు వర్తక సంఘాలలో సభ్యులుగా చేరే ఎస్సీ, ఎస్టీలు ఈ రుణం పొందేందుకు అర్హులుగా ప్రకటించారు. 18 సంవత్సరాలు పైబడిన చిరు వర్తకులకు ఈ రుణాలను విస్తృతంగా, త్వరితగతిన అందించేందుకు తగిన ప్రణాళికతో టాడ్కో వర్గాలు పరుగులు తీస్తున్నాయి. అదే సమయంలో తమిళానాడులో ప్రయోగాత్మకంగా కోయంబేడులో అమలు చేసిన ఈ రుణ సేవ విజయవంతంపై కేంద్ర ప్రభుత్వం సైతం దృష్టి పెట్టడం విశేషం. కేంద్ర బృందం ప్రతినిధులు దీనిపై అధ్యయనం చేసి వెళ్లి ఉన్నారు. టాడ్కో వర్గాలు పేర్కొంటూ ఆదిద్రావిడర్‌ సామాజిక వర్గానికి గృహాల కేటాయింపు, నిధుల సమీకరణ మీద తొలినాళ్లలో దృష్టి పెట్టిన, తాము ప్రస్తుతం చిరు వర్తకుల జీవితాలలో చిరునవ్వు, ఆర్థిక పరిస్థితి మెరుగు దిశగా ప్రభుత్వ ఆదేశాలతో రుణ పంపిణీ విస్తృతం చేస్తున్నామని ప్రకటించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
చిరు వ్యాపారులకు.. ప్రోత్సాహం 1
1/5

చిరు వ్యాపారులకు.. ప్రోత్సాహం

చిరు వ్యాపారులకు.. ప్రోత్సాహం 2
2/5

చిరు వ్యాపారులకు.. ప్రోత్సాహం

చిరు వ్యాపారులకు.. ప్రోత్సాహం 3
3/5

చిరు వ్యాపారులకు.. ప్రోత్సాహం

చిరు వ్యాపారులకు.. ప్రోత్సాహం 4
4/5

చిరు వ్యాపారులకు.. ప్రోత్సాహం

చిరు వ్యాపారులకు.. ప్రోత్సాహం 5
5/5

చిరు వ్యాపారులకు.. ప్రోత్సాహం

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement