పన్నీరు సోదరుడు రాజకు విముక్తి
● పూజారి మరణం కేసులో విడుదల
సాక్షి, చైన్నె: మాజీ సీఎం ఓ పన్నీరు సెల్వం సోదరుడు ఓ రాజకు పూజారి నాగముత్తు ఆత్మహత్య కేసు నుంచి విముక్తి కలిగింది. రాజతో పాటుగా ఏడుగురిని విడుదల చేస్తూ దిండుగల్ కోర్టు బుధవారం తీర్పు వెలువరించింది. వివరాలు.. ఓ పన్నీరు సెల్వం సీఎంగా ఉన్న సమయంలో ఆయన సోదరుడు, పెరియకుళం మునిసిపాలిటీ చైర్మన్ ఓ రాజ సాగించిన వ్యవహారాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయనపై వచ్చిన ఆరోపణలు, ఫిర్యాదులను అన్నాడీఎంకే అధిష్టానం అప్పట్లో తీవ్రంగానే పరిగణించింది. అదే సమయంలో కై లాసనాథ ఆలయం పూజారి నాగముత్తు ఆత్మహత్య కేసులో రాజ ప్రమేయం ఉన్నట్టుగా వచ్చిన ఆరోపణలతో ఆయనపై కన్నెర్ర చేశారు. సీబీసీఐడీ రంగంలోకి దిగి విచారణ చేపట్టింది. గత కొన్నేళ్లుగా సాగుతూ వచ్చిన ఈ కేసు విచారణ ఇటీవల ముగిసింది. 196 పేజీల చార్జ్ షీట్‌లోని అంశాలు, 23 మంది సాక్షుల వాంగ్మూలం నమోదు చేశారు. కాగా దీనిపై బుధవారం న్యాయమూర్తి మురళీధరన్ తీర్పు వెలువరించారు. ఓ రాజతో పాటు ఏడుగురిని ఈకేసు నుంచి విడుదల చేస్తూ తీర్పు వెలువరించారు.
Comments
Please login to add a commentAdd a comment