బస్సు ఢీకొని యువతి దుర్మరణం
సేలం: బస్సు ఢీకొని యువతి దుర్మణం చెందిన సంఘటన నెల్లైలో జరిగింది. ఈ ప్రమాద ఘటన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. నెల్లై రామైయ్యన్పట్టి సమీపంలో ఉన్న వెంప్పంకుళం ప్రాంతానికి చెందిన పాల్దురై కార్మికుడిగా జీవిస్తున్నాడు. ఇతనికి భార్య ఎస్తెర్ మేరి, నలుగురు కుమార్తెలు ఉన్నారు. వీరిలో మూడో కుమార్తె సెల్వం (19) పాలయంకోట్టై పెరుమాల్పురంలో ఉన్న కళాశాలలో చదువుతోంది. రెండో కుమార్తె సుదర్శనా నెల్లై టౌన్లో ఉన్న కార్పొరేషన్ బాలికల మహోన్నత పాఠశాలలో చదువుతోంది. ఈ క్రమంలో గురువారం ఉదయం చెల్లెలు సుదర్శనను పాఠశాలకు పంపించడం కోసం రామయ్యన్పట్టి శివాజీ నగర్ బస్టాండ్‌లో టౌన్ బస్సులో సుదర్శనను ఎక్కించింది. బస్సు అక్కడే నిలబడి ఉండగా, బస్సులో ఉన్న చెల్లెలు కళ్ల ఎదుటే బైక్‌లో రోడ్డు దాటుతున్న సెల్వంను నెల్లై వైపుగా వేగంగా వచ్చిన ప్రైవేటు బస్సు ఢీకొంది. దీంతో బస్సు ముందు వైపు చక్రం కింద బైకు చిక్కుకుంది. దీంతో సెల్వం తీవ్రంగా గాయపడి సంఘటనా స్థలంలోనే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటే సంఘటనా స్థలానికి చేరుకుని సెల్వం మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం నెల్లై ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment