పిల్లలకు ఆడుకునే స్వేచ్ఛను ఇవ్వాలి
తిరువళ్లూరు: పిల్లలకు ఆడుకునే స్వేచ్ఛను ఇవ్వాలని, వారు చేసే పనుల్లో మంచిచెడును వివరించి చెప్పాలని చిన్నపిల్లల విభాగం ప్రభుత్వ వైద్యశాల హెచ్‌ఓడీ డాక్టర్ శ్రీదేవి సూచించారు. తిరువళ్లూరు ప్రభుత్వ వైద్యశాలలో చిల్డ్రన్స్‌డే వేడుకలను గురువారం ఉదయం నిర్వహించారు. కార్యక్రమానికి సేవాలయ ట్రస్టీ అమిత్‌చంద్‌జైన్ అధ్యక్షత వహించగా వైద్యశాల చిన్నపిల్లల వైద్యవిభాగం హెచ్‌ఓడీ డాక్టర్ శ్రీదేవీ హాజరై ప్రసంగించారు. చిన్నపిల్లలను నిర్బంధంలో వుంచకూడదన్నారు. వారి ఇష్ట్రపకారం ఆడుకునే స్వేచ్ఛను కల్పించడంతో పాటు సెల్‌ఫోన్‌కు దూరంగా వుంచాలన్నారు. పిల్లలు ఆడుకోవడం వల్ల మానసికంగా ఆరోగ్యంగా ఎదుగుదల వుంటుందన్న ఆమె, ఇష్టమైన ఆహారాన్ని ఇవ్వడానికి యత్నించాలని సూచించారు. ప్రభుత్వ వైద్యశాలలోని చిన్నపిల్లల వార్డును ఆహ్లాదకరంగా తీర్చిదిద్దడానికి గోడలపై బొమ్మలు, కార్టూన్స్‌ను సేవాలయ సహకారంతో వేశామని వివరించారు. రెండు వందల మంది చిన్నారులకు బ్రెడ్, పండ్లు, బిస్కెట్‌లను అందజేశారు. సేవాలయ వైస్ ప్రెసిడెంట్ కింగ్‌స్టన్, వ్యాపారవేత్తలు సంతోష్‌జైన్, అశోక్‌కుమార్‌జైన్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment