క్లుప్తంగా
తలకిందులుగా నిలబడి.. లీటరు నీళ్లు తాగి..
– విరుదునగర్ యువకుడు గిన్నిస్ రికార్డు
సేలం: తలకిందులుగా నిలబడి 17.24 సెక న్ల లో ఒక లీటరు నీళ్లు తాగి విరుదునగర్ యువకుడు గిన్నిస్ రికార్డు సృష్టించాడు. విరుదునగర్ జిల్లా రాజపాళయం ముగవూర్ ప్రాంతానికి చెందిన పాప్పయ్యా, సుబ్బులక్ష్మి దంపతుల కుమారుడు అరుణ్‌కుమార్ (26) చైన్నెలోని ఒ క ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నారు. చిన్నతనం నుంచి ఏదైనా సాధించాలనే తపనతో ఉన్న అ రుణ్ కుమార్‌ను పలువురు తలకిందులుగా నీ ళ్లు తాగినా సాధించలేవని ఎగతాలి చేసినట్టు తె లిసింది. ఆ ఎగతాలి మాటలనే ఎందుకు సా ధించకూడదన్న ఆలోచనతో అప్పటి నుంచే అ రుణ్ కుమార్ తల కిందులుగా నిలబడి నీళ్లు తాగడాన్ని సాధన చేశాడు. అలా తొలి నాళ్లలో తల కిందులుగా ఉండి నీళ్లు తాగితే ప్రెషర్ కారణంగా ఒకసారి ముక్కులో నుంచి రక్తం కూడా కారింది. అయినా పట్టు వీడక అరుణ్ కుమార్ సాధన కొనసాగించాడు. అలా గత ఏడాది తలకిందులుగా నిలబడి 26.04 సెకన్ల సమయంలో ఒక లీటర్ నీళ్లు తాగి అరుణ్ కుమార్ గిన్నిస్ రికార్డు సృష్టించాడు. తర్వాత గత జనవరి నెల లో ఒక చేతిని నేలపై పెట్టి తల కిందులుగా ని లబడి 25.01 సెకన్లలో ఒక లీటర్ నీళ్లు తాగి గిన్నిస్ పుస్తకంలో స్తానం సంపాదించాడు. తన రికార్డును తానే బద్దలుకొట్టదలచిన అరుణ్ కు మార్ బుధవారం మళ్లీ తలకిందులుగా నిల బడి, తలను నేలకు తగలనివ్వకుండా ఒంటి చేతితో నిలబడి 18.23 సెకన్ల సమయంలో ఒక లీటర్ నీళ్లు తాగాడు. మళ్లీ మరో మారు 17.24 సెకన్లలో ఒక లీటర్ నీళ్లు తాగి రికార్డు సృష్టించాడు. ఆయన సాధనను గిన్నిస్ రికార్డు కోసం పంపించాడు. ఈ సందర్భంగా అరుణ్ కు మార్‌ను పలువురు అభినందిస్తున్నారు.
సెల్‌ఫోన్ పేలి ఇంజినీర్ మృతి
అన్నానగర్: సెల్‌ఫోన్ దిండు పక్కనే పెట్టుకుని నిద్రపోతున్న సమయంలో అది పేలి ఓ ఇంజనీర్ మృతి చెందాడు. నైల్లె జిల్లాలోని నాంగునేరి పె రున్ వీధి ప్రాంతంలో వానుమలై, వీరలక్ష్మి ఉన్నా రు. వీరికి ముగ్గురు కుమారులు. పెద్ద కుమారుడు సెల్వసతీష్ (26) మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసి పెయింటర్‌గా పనిచేస్తున్నాడు. ఈ స్థితిలో సె ల్వసతీష్ ఇద్దరు తోటి కార్మికులతో కలిసి నాగర్‌కోయిల్ సమీపంలోని ఆలూరు ప్రాంతంలో ఓ అ ద్దె ఇంట్లో ఉంటూ పెయింటింగ్ పనికి వెళ్లాడు. బుధవారం రాత్రి ముగ్గురూ పని ముగించుకుని ఇంటికి వచ్చేసరికి మద్యం మత్తులో ఉన్న సెల్వసతీష్ మాత్రం పైగదిలోని మంచంపై పడుకున్నా డు. మిగిలిన ఇద్దరు గ్రౌండ్ ఫ్లోర్‌లోని ఓ గదిలో ఆరుబయట నిద్రిస్తున్నారు. గురువారం ఉదయం సెల్వసతీష్ గది నుంచి బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన సహోద్యోగి వెంకటేష్ గదిలోకి వెళ్లి చూడగా సెల్వసతీష్ చనిపోయి ఉ న్నాడు. అతని సెల్‌ఫోన్ పేలి మంచం పైఉన్న ప రుపులు, కుర్చీలు కూడా కాలిపోయి శిథిలావస్థలో పడి ఉన్నాయి. దీంతో వెంకటేష్ పోలీసులకు స మాచారం అందించాడు. పోలీసులు వెంటనే ఘ టనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ సెల్వ సతీష్ అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఫోరెన్సిక్ నిపుణులను రప్పించి విచారణ చేపట్టారు. సెల్వసతీష్ నిద్రిస్తున్న సమయంలో సెల్‌ఫోన్‌ను దిండు దగ్గర పెట్టుకున్నాడని పోలీసుల ప్రాథమిక వి చారణలో తేలింది. అప్పుడు సెల్‌ఫోన్ పేలిపోయి ఉండవచ్చని, సెల్వసతీష్ మద్యం మత్తు లో కింద దిగి నిద్రపోయి ఉండవచ్చని చెబుతున్నారు.
బస్సు ఢీకొని వృద్ధురాలు..
సేలం: సత్యమంగళం బస్టాండ్‌లో గురువారం ఉదయం ప్రభుత్వ బస్సు ఢీకొని ఓ వృద్ధురాలు దుర్మరణం చెందింది. ఈరోడ్ జిల్లా వెంకనాయకన్‌పాళయంలోని పులియంపట్టి ప్రాంతానికి చెందిన సావిత్రి (60). ఈమె గురువారం ఉదయం 6.30 గంటలకు సత్యమంగళం బస్టాండ్‌లోని పూల మార్కెట్‌కు వచ్చి పూలు కొనుగోలు చేసింది. ఆ సమయంలో ఈరోడ్ జిల్లా తాళ్లవాడి నుంచి ప్రయాణికులను ఎక్కించుకుని ప్రభుత్వ బస్సు ఈరోడ్ వైపు వెళుతోంది. సత్యమంగళం బస్టాండ్‌లోకి ప్రవేశించేందుకు ప్రభుత్వ బస్సు ప్రవేశ ద్వారం వద్ద మలుపు తిరుగుతుండగా, సావిత్రిని బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో సావిత్రి సంఘటన స్థలంలోనే మృతిచెందింది. సమాచారం అందుకున్న సత్యమంగళం పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సత్యమంగళం ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
రూ.7లక్షల దోపిడీ
– ముగ్గురి అరెస్టు
సేలం: రాళ్ల క్వారీలో రూ.7 లక్షలు దోచుకున్న ముగ్గురు ఉత్తరాది కార్మికులను పోలీసులు అ రెస్టు చేశారు. నామక్కల్ జిల్లా సేందమంగళం సమీపంలోని కొండమనాయకన్‌పట్టి ప్రాంతంలో శ్రీపాలన్ రాళ్ల క్వారీ నిర్వహిస్తున్నాడు. అ క్కడ బుధవారం అర్ధరాత్రి చొరబడిన ముగ్గురు సెక్యూరిటీ పళనిస్వామి (53)ను కొట్టి, కార్యా లయ తాళాలు పగులగొట్టి అందులో ఉన్న రూ.7 లక్షల నగదును దోచుకెళ్లారు. పోలీసులు జరిపిన విచారణలో రాళ్ల క్వారీలో పనిచేస్తున్న వారే ఈ దోపిడీకి పాల్పడినట్లు తెలిసింది. అ నంతరం బిహార్‌కు చెందిన మహ్మద్ అజాద్ (24), మహ్మద్ జలాల్ (25), ఆయన తమ్ము డు సులే(22) ఆ క్వారీలో పనిచేసిన వారని తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు కృష్ణగిరి సమీపంలోని బస్సులో ముగ్గురు పరారవుతున్నట్టు తెలిసింది. పోలీసులు ప్రత్యేక బృందంగా ఏర్పడి ఆ ముగ్గురిని అరెస్టు చేశారు. వా రి నుంచి రూ.7 లక్షల నగదును స్వాధీనం చే సుకుని వారి వద్ద విచారణ జరుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment