వేగంగా అద్దాల వంతెన పనులు
సాక్షి, చైన్నె: త్రివేణి సంగమ క్షేత్రంలో అద్దాల వంతెన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మరో పదిహేను రోజుల్లో పనులు ముగించే విధంగా సీఎం స్టాలిన్ ఆదేశించారు. బంగాళాఖాతం, హిందూ, అరేబియా మహాసముద్రాల త్రివేణి సంగమంతో పర్యాటకంగా బాసిళ్లుతున్న క్షేత్రం కన్యాకుమారి. సూ ర్యోదయం, సూర్యాస్తమయాన్ని తన్మయత్వంతో తి లకించేందుకు ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రదేశం కూడా. ఈ త్రివేణి సంగమ క్షేత్రంలో సముద్రం మధ్యలో నల్ల చలువరాతితో వివేకానందరాక్ స్మా రక మందిరం ఉంది. ఇక్కడికి కూతవేటు దూరంలో పరమశివుడ్ని పరిణయం ఆడేందుకు పార్వతి దేవి తపస్సు చేసినట్టు చాటే శిలారూపంలోని ఆమె పాదముద్రలను వీక్షించొచ్చు. ఇక తమిళుల మహా కవి తిరువళ్లువర్ 133 అడుగుల నిలువెత్తు విగ్రహం ఇక్కడే కొలువుదీరి ఉంది. దక్షిణాసియాలోని ఎత్తైన విగ్రహాల జాబితాలో ఇది కూడా ఒకటి. వీటిని వీక్షించాలంటే పడవలో పయనించాల్సిందే. అలాగే, ఆధ్యాత్మికతకు నెలవుగా భగవతి అమ్మన్ ఇక్కడ ప్రసిద్ధి చెంది ఉంది.
అద్దాల వంతెన
స్వామి వివేకానంద ధ్యానం చేసిన రాక్ వద్దకు ఒడ్డు నుంచి పూంబుహార్ పడవల్లో ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఇక్కడి నుంచి మళ్లీ పడవలో తిరువళ్లువర్ 133 అడుగుల విగ్రహం వద్దకు పర్యాటకులు వెళ్లాల్సి ఉంటుంది. అయితే, అలల తాకిడి కారణంగా తరచూ తిరువళ్లువర్ విగ్రహం వద్దకు వెళ్ల లేని పరిస్థితి. వివేకా నందరాక్ నుంచి తిరువళ్లువర్ విగ్రహం వరకు అద్దాలతో వంతెన నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. రూ.37కోట్లతో 77 మీటర్ల పొడవు, 10 మీటర్ల వెడల్పుతో ఈ వంతెన రూపుదిద్దుకుంటోంది. పనుల న్నీ ముగింపు దశకు చేరాయి. మరో పదిహేను రోజుల్లో అన్ని పనులు ముగించే విధంగా అధికారులను సీఎం ఆదేశించారు. డిసెంబర్ 31, జనవరి ఒకటో తేదీల్లో జరిగే తిరువళ్లువర్ విగ్రహం సిల్వర్ జూబ్లీ వేడుక రోజున ఈ అద్దాల వంతెన ప్రారంభోత్సవానికి నిర్ణయించారు.
Comments
Please login to add a commentAdd a comment