తృటిలో తప్పిన ప్రమాదం
–ఒకదానికొకటి రాసుకున్న బస్సులు
–ప్రయాణికులు సురక్షితం
తిరుత్తణి: పట్టణ శివారులో గురువారం మధ్యాహ్నం ఆంధ్ర ఆర్టీసీ, ప్రైవేటు బస్సు రాసుకోవడంతో ప్రమాదం చోటుచేసుకుంది. అయితే ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. తిరుత్తణి నుంచి గురువారం మధ్యాహ్నం ప్రైవేటు బస్సు కాంచీపురం నగరానికి బయలుదేరింది. ఆ బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. అదే సమయంలో కాంచీపురం నుంచి తిరుపతికి వెళ్లే ఆర్టీసీ బస్సు తిరుత్తణి సమీపంలోని వళ్లియమ్మపురం వద్ద వస్తుండగా అరక్కోణం హైవేలో రోడ్డు పనుల కోసం ఒన్‌వేగా రోడ్డును మార్చారు. ఆ ప్రాంతంలో వేగంగా వచ్చిన రెండు బస్సులు ఒన్‌వేలో చిక్కుకుని రాసుకున్నాయి. రెండు బస్సుల అద్దాలు పగలడంతో ప్రయాణికులు ఆందోళన చెందిన బస్సు నుంచి సురక్షితంగా గాయాలు కాకుండా దిగారు. వెంటనే పోలీసులు సంఘటన ప్రాంతం చేరుకుని రోడ్డులో చిక్కుకున్న బస్సులను తొలగించి, ట్రాఫిక్ సమస్య పరిష్కరించారు. తిరుత్తణి పోలీసులు ప్రమాదం పట్ల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
యువకుడి ఆత్మాహుతి
సాక్షి, చైన్నె: చైన్నె అశోక్‌నగర్‌లో ఓ యువకుడు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చైన్నె శోక్‌నగర్ 3వ అవెన్యులో ప్రభుత్వ మహోన్నత పాఠశాల, క్రీడాకారులకు హాస్టల్ భవనం ఉంది. బుధవారం రాత్రి 11.30 గంటల సమయంలో మంటల్లో కాలుతూ ఓ యువకుడు పరుగెత్తుకుంటూ వచ్చి ఆపాఠశాల ప్రవేశమార్గం వద్ద కుప్పకూలాడు. ఈ దృశ్యాన్ని చూసిన హాస్టల్‌లోని క్రీడాకారులు రక్షించే ప్రయత్నంచేసినా ఫలితం శూన్యం. అప్పటికే అతడు పూర్తిగా కాలిపోయాడు. సమాచారం అందుకున్న అశోక్‌నగర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ రాధాకృష్ణన్ నేతృత్వంలోని బృందం అక్కడికి చేరుకుంది. పూర్తిగా యువకుడి శరీరం ఆహుతి అయింది. సంఘటన స్థలంలోనే అతడు మృతిచెందాడు. ఆ పరిసరాల్లోని సీసీ కెమెరాలను పరిశీలించగా, పాఠశాలకు సమీపంలో ఆ యువకుడు పెట్రోల్‌ను తన ఒంటిపై పోసుకుని నిప్పు అంటించుకున్న దృశ్యాలు బయటపడ్డాయి. మంటల్లో కాలుతూ ఆ యువకుడు పాఠశాలలోకి వెళ్లేందుకు ప్రయ త్నించి, చివరకు మంటల తీవ్రతతో కుప్పకూలడం వెలుగుచూసింది. శరీరం గుర్తుపట్టనంతగా కాలిపోవడంతో ఆ యువకుడి ఆచూకీ కనిపిపెట్టడం పోలీసులకు శ్రమగా మారింది. అదే సమయంలో ఆయువకుడు ఎందుకు ఆత్మా హతి చేసుకున్నాడు, పాఠశాలలోకి ప్రవేశించే ప్రయత్నం ఎందుకు చేశాడు, అక్కడ ఎవరైనా అతడికి కావాల్సిన వాళ్లు ఉన్నారా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment