– ఆరుగురి అరెస్టు
తిరువొత్తియూరు: చైన్నె నగరంలో రెండు వేర్వేరు ఘటనల్లో మత్తు పదార్థాలను అక్రమంగా తరలిస్తున్న ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. చైన్నె తిరువొత్తియూరు ప్రాంతంలో గంజాయి తరలిస్తున్నట్లు ప్రత్యేక బృందం పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు ఆ ప్రాంతంలో తనిఖీలు చేశారు. ఆ సమయంలో గోమాత నగర్‌లో గుర్తుతెలియని యువకులు చేతిలో సంచిని పట్టుకుని నడిచి వెళుతున్నారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ జరిపారు. వారి వద్ద ఉన్న సంచిని తనిఖీ చేయగా అందులో గంజాయి ఉండడాన్ని గుర్తించారు. విచారణలో వారు ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న కరూర్ జిల్లా కృష్ణ రాయపురం ప్రాంతానికి చెందిన ప్రభు (26), పులియూరు ప్రాంతానికి చెందిన హరీష్ (26), కోవై జిల్లాకు చెందిన 17 సంవత్సరాల బాలుడు అని తెలిసింది. పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 3 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. దీనిపై ఇన్‌స్పెక్టర్ రజనీస్ కేసు నమోదు చేసి విచారణ చేస్తూ ఉన్నారు. అలాగే విరుగంబాక్కం ప్రాంతంలో కొరియర్‌లో మత్తు పదార్థాలులను దిగుమతి చేసుకున్న ఇంజినీర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. విరుగంబాక్కం ప్రాంతంలో మసీదు వీధికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అన్బుగిరి (36)కి కొరియర్‌లో బెంగళూరు నుంచి పార్శిల్ వచ్చింది. పోలీసులు దానిని స్వాధీనం చేసుకుని, తనిఖీ చేశారు. జీన్స్ ప్యాంట్ పార్శిల్‌లో హైగ్రేడ్ డ్రగ్ శ్రీమెథాంఫెటమైన్ఙ్ దాచి ఉండగా గుర్తించారు. అన్బుగిరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు 4 గ్రాముల మత్తుపదార్థాన్ని స్వాధీనం చేసుకున్నారు. అన్బుగిరి డ్రగ్స్‌ను పార్శిళ్ల ద్వారా కొనుగోలు చేసినట్లు విచారణలో తేలింది. అలాగే చైన్నె ఐనావరం ప్రాంతంలో ఎంటీఎంఏ అనే మత్తుమాత్రలు విక్రయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు ఆ ప్రాంతంలో తీవ్రంగా నిఘా వేశారు. ఆ సమయంలో సందేహాస్పదంగా తిరుగుతున్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. తనిఖీలో వారి వద్ద ఖరీదైన గంజాయి 30 గ్రాములు, ఎంటీఎంఏ అనే మత్తుమాత్రలు 167 ఉన్నట్లు తెలిసింది. దీంతో పోలీసులు వాటిని స్వాధీనం చేసుకుని పాడి అభయ్ అవ్వై నగర్ ప్రాంతానికి చెందిన రాజేష్ (36), కొరటూరు కండ్రిగ నగర్ ప్రాంతానికి చెందిన ప్రదీప్ (38) అనే ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment