సమస్యలు చిన్నవే.. సర్దుకుపోదాం
– మాజీ మంత్రి రమణ
తిరువళ్లూరు: పార్టీలో నేతల మధ్య ఉన్న సమస్యలు చిన్నవేనని, వాటిని సర్దుకుని ఎన్నికల్లో విజయం సాధించడానికి కార్యకర్తలు, నేతలు ముందుకు రావాలని అన్నాడీఎంకే జిల్లా కన్వీనర్ మాజీ మంత్రి రమణ పిలుపునిచ్చారు. తిరువళ్లూరులోని ఓ ప్రైవేటు కల్యాణమండపంలో తిరువళ్లూరు జిల్లా అన్నాడీఎంకే నేతలు కార్యకర్తల ప్రత్యేక సమావేశం జరిగింది. కార్యక్రమానికి నగర అధ్యక్షుడు కందస్వామి అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా మాజీ మంత్రి జిల్లా కన్వీనర్ రమణ హాజరై ప్రసంగించారు. అన్నాడీఎంకేలో పార్టీ నేతలు కార్యకర్తల మధ్య చిన్నచిన్న సమస్యలు మనస్పర్థలు ఉన్నాయి. వీటిని గుర్తించి సర్దుకుపోతే వచ్చే ఎన్నికల్లో అన్నాడీఎంకే విజయం పెద్దగా కష్టం కాదన్నారు. పార్టీ నిరుపేదల కోసం గతంలో చేపట్టిన పథకాలను ప్రజలకు వివరించడంతోపాటు ఇటీవల డీఎంకే పెంచిన బస్‌చార్జీలు, విద్యుత్ చార్జీలు, ఇంటి పన్నుతో పాటు ప్రస్తుత ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించాలని కోరారు. గ్రామస్థాయి నుంచి పార్టీ నేతలు కార్యకర్తలను ఎన్నికలకు సిద్ధం చేయాలని కూడా పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పార్టీ ఎన్నికల పరిశీలకుడు ఎస్‌ఆర్ విజయకుమార్, పార్టీ నేతలు తుకారామ్, త్యాగు, బాలజీ, రామ్‌కుమార్, జ్యోతి, సుమిత్రవెంకటేషన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment