వీరమణిపై ఈసీ కన్నెర్ర!
సాక్షి, చైన్నె: ప్రమాణ పత్రంలో ఆస్తుల వివరాలను దాచి పెట్టిన మాజీ మంత్రి, అన్నాడీఎంకే సీ నియర్ నేత కేసీ వీరమణి పై కేంద్ర ఎన్నికల కమి షన్ కన్నెర్ర చేసింది. ఆ యనపై గురువారం కేసు నమోదు చేసింది. కేసీ వీరమణి అన్నాడీఎంకే హయాంలో మంత్రిగా పనిచేశారు. తిరుపత్తూరు జిల్లా జోలార్‌పేట నుంచి ఆయన 2021లో పోటీ చేశారు. ఈ సందర్భంగా సమర్పించిన ప్రమాణ పత్రంలో ఆ స్తుల వివరాలను దాచి పెట్టారన్న ఆరోపణలు వచ్చాయి. అదేసమయంలో రామమూర్తి అనే సామాజిక కార్యకర్త ఎన్నికల కమిషన్‌కు ఆధారాలు సహా ఫిర్యాదు చేయడమే కాకుండా, కోర్టును సైతం ఆశ్రయించారు. కోర్టు విచారణ లో వెలుగు చూసిన అంశాల ఆధారంగా కేసీ వీరమణిపై కన్నెర్ర చేయడానికి ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. ఇందులోభాగంగా కోర్టు ఆదేశాలకు అనుగుణంగా వీరమణిపై ఎన్నికల కమిషన్ గురువారం కేసు నమోదు చేసినట్టు తెలిసింది. ఇదిలాఉండగా ఇటీవల కాలంగా కేసీ వీరమణిని టార్గెట్ చేసి ఏసీబీ సోదాలు సాగుతున్న విషయం తెలిసిందే.
లాటరీ కింగ్ లక్ష్యంగా ఈడీ సోదాలు
● వీసీకే నేత ఇంట్లో కూడా
సాక్షి, చైన్నె: లాటరీ కింగ్ మార్టిన్ లక్ష్యంగా ఈడీ వర్గాలు చైన్నె, కోయంబత్తూరులలో గురువారం సోదాలు ముమ్మరం చేశారు. మార్టిన్ అల్లుడు, వీసీకే నేత అర్జున్ ఇళ్లు, కార్యాలయాల్లోనూ సోదాలు జరుగుతున్నాయి. కోయంబత్తూరు తుడియలూరుకు చెందిన లాటరీ వ్యాపారి మార్టిన్‌ను కింగ్ ఆఫ్ లాటరీ అని అందరూ పిలుస్తుంటారు. ఆ మేరకు లాటరీ టికెట్ల అమ్మకంపై కేరళ రాష్ట్రం నుంచి హక్కులు ఆయన పొంది ఉన్నాడు. సిక్కిం లాటరీ టికెట్ల అమ్మకాల్లో నియమాలను అతిక్రమించి కేరళలో కోట్లాది రూపాయల అక్రమాలకు పాల్పడినట్లుగా ఆయనపై వచ్చిన ఆరోపణలతో గతంలో సీబీఐ కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది. సిక్కిం లాటరీ టికెట్లను అమ్మి రూ.910 కోట్ల 30 లక్షల ప్రైజ్‌మనీలో అక్రమాలకు పాల్పడినట్లు విచారణలో తేలింది. ఈ సొమ్ము ద్వారా అనేక కంపెనీలు స్థాపించి స్థిరాస్తులను కొనుగోలు చేసినట్లు కనుగొన్న సీబీఐ కోర్టులో చార్జిషీటు దాఖలు చేసింది. గతంలో సైతం ఆయన నివాసం, కార్యాలయాలు, విద్యా సంస్థలలో ఓ వైపు సీబీఐ, మరో వైపు ఈడీ సోదాలు నిర్వహించింది. ఇందులో లభించిన సమాచారంతో రాజకీ యపక్షాలకు సైతం మార్టిన్ ఎన్నికల విరా ళాలు ఇవ్వడం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆయనకు సంబంధించిన అనేక ఆస్తులను అటాచ్ చేశారు. ఈ పరిస్థితులలో గురువా రం ఉదయాన్నే, కోయంబత్తూరు, చైన్నెలలో ని ఐదు చోట్ల ఈడీ అధికారులు రంగంలోకి దిగి సోదాలలో నిమగ్నమయ్యారు. కోయంబత్తూరులోని మార్టిన్ నివాసం, కార్యాలయం, హోమియో పతి కళాశాలలో సోదాలు జరుగుతున్నాయి. చైన్నెలోని ఆయన అల్లుడు, వీసీకే నేత అర్జున్ నివాసం కార్యాలయాలలోనూ సోదాలు జరుగుతున్నాయి. అన్ని చోట్ల కేంద్ర బలగాల భద్రత నడుమ సోదాలు కొనసాగుతున్నాయి.
మాదకద్రవ్యాల కేసులో ఈడీ చార్జ్‌షీట్
సాక్షి, చైన్నె: మాదకద్రవ్యాల కేసులో సీబీఐ కోర్టులో గురువారం ఈడీ చార్జ్‌షీట్ దాఖలు చేసింది. సినీ నిర్మాత జాఫర్ సాధిక్, దర్శకుడు అమీర్‌తో పాటు 12 మందిని నిందితులుగా చేర్చారు. ఇటీవల ఢిల్లీలో రూ.2 వేల కోట్ల విలువ గల మాదకద్రవ్యాలు బయట పడిన విషయం తెలిసిందే. ఈ కేసులో తమిళనాడుకు చెందిన ముగ్గురిని అరెస్టు చేశారు. విచారణలో ఈ స్మగ్లింగ్‌కు సూత్రధారి చైన్నెకు చెందిన సినీ నిర్మాత, డీఎంకే మాజీ నేత జాఫర్ సాధిక్ అని తేలింది. మూడేళ్లలో జాఫర్ సాధిక్ ముఠా 3,500 కిలోల మత్తు పదార్థాలను తమిళనాడు నుంచి పలు దేశాలకు స్మగ్లింగ్ చేసినట్టు విచారణలో తేలింది. తనను ఎన్‌సీబీ టార్గెట్ చేయడంతో జాఫర్ సాధిక్ తొలుత అజ్ఞాతంలోకి వెళ్లాడు. అతడి సోదరులు సలీం, మైదీన్ కూడా పత్తా లేకుండా పోయారు. ఎట్టకేలకు ఎన్‌సీబీ అధికారులకు సాధిక్ చిక్కాడు. జాఫర్ సాధిక్ సినిమాలు, హోటళ్లు, రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టినట్టుగా విచారణలో వెలుగు చూసింది. ఈ కేసు చైన్నె సీబీఐ కోర్టులో విచారణ జరుగుతోంది. ఈ వ్యవహారంలో మనీలాండరింగ్‌పై దృష్టి పెట్టి ఈడీ వర్గాలు సైతం విచారణ చేశాయి. ఇచార్జ్‌షీట్‌ను కోర్టుకు సమర్పించారు. సాధిక్, అతడి భార్య అమినాభాను, మహ్మద్ సలీం, మైదిన్ ఖణి, దర్శకుడు అమీర్ సహా 12 మంది పేర్లను నిందితులుగా చార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment