రూట్ గైడ్ రోబో ఆవిష్కరణ
● ప్రతిభ చాటిన ఐఐటీ మద్రాసు, ఓపీ జిందాల్ పరిశోధకులు
సాక్షి, చైన్నె: ఐఐటీ మద్రాసు, ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ విద్యార్థులు, పరిశోధకుల సంయుక్త భాగస్వామ్యంతో టూర్ గైడ్ రోబోను రూపొందించారు. త్వరలో ప్రారంభం కానున్న భారత రాజ్యాంగ మ్యూజియం విజిటర్స్, ఇంటరాక్టివ్ డిస్‌ప్లేల కోసం స్మార్ట్ అసిస్టెంట్‌గా ఈ రోబో పనిచేయనుంది. ఈమేరకు ఈ రోబోను చైన్నెలో ఆవిష్కరించారు. అత్యాధునిక సాంకేతికత, ఏఐ ఇంటరాక్టివ్ అనుభవాలు, 3–ఈ ఇన్‌స్టలేషన్, ప్రోగ్రెసివ్ డిస్‌ప్లేలతో దీనిని సిద్ధం చేశారు. ఎస్‌ఏఎంబీఐడీ ప్రాజెక్టు సందర్శకుల అనుభవాన్ని ఇంటరాక్టివ్‌గా మార్చే అధునాతన భాషను ఈ రోబోట్ ఉపయోగించే విధంగా తీర్చిదిద్దారు. గైడెడ్ టూర్‌లు, ఎగ్జిబిట్‌ల గురించి వివరణాత్మక సమాచారాన్ని ఇది అందించనుంది. ఈసందర్భంగా ఐఐటీ మద్రాసు డైరెక్టర్ వీ కామకోటి మాట్లాడుతూ చరిత్రకు ప్రాణం పోసే మానవరూప రోబోట్ అయిన ఎస్‌ఏఎంవీఐ ద్వారా భారతదేశ రాజ్యాంగ చరిత్రకు తాము సైతం సహకారంగా నిలవడం ఆందనంగా ఉందన్నారు. జిందాల్ గ్లోబల్ వర్సిటీ వైస్ చాన్స్‌లర్ సి. రాజ్‌కుమార్ మాట్లాడుతూ ఇది చరిత్ర, సంప్రదాయం, సాంకేతిక ఆవిష్కరణలను కలిపే వినూత్న ప్రాజెక్టుగా వివరించారు. ఐఐటీ మద్రాసు ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ ప్రెన్యూర్‌షిప్ ద్వారా ఈ ప్రాజెక్టు అమలు పర్యవేక్షణ జరుగుతుందన్నారు. రాజ్యాంగ మ్యూజియం కోసం టూర్ గైడ్ రోబోట్‌గా ప్రత్యేకంగా దీనిని రూపొందించామన్నారు. ఐఐటీ మద్రాసు ప్రొఫెసర్లు వెంకటేష్ బాలసుబ్రమణియన్, పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment