నైపుణ్యాలతో ఉపాధికి మార్గం
● యూజీసీ చైర్మన్ ● కొత్త కోర్సులకు కసరత్తులు ● వారి వారి భాషలలో విద్యా బోధనకు చర్యలు
సాక్షి, చైన్నె : ఉన్నత విద్య ప్రవేశం, సమానత్వంనెపుణ్యాల అభివృద్ధి వంటి అంశాలు వివిధ వృత్తులలో రాణించాలనుకునే విద్యార్థులకు ఉపాధికి ప్రధాన మార్గాలు అని యూజీసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎస్ జగదీశ్‌కుమార్ అన్నారు. యూని వర్సిటీ గ్రాంట్స్ కమిషన్, మద్రాసు ఐఐటీ నేతృత్వంలో జాతీయ విద్యా విధానం 2020పై స్వ యం ప్రతిపత్తి హోదా కలిగిన కళాశాలల దక్షిణ జోన్ సమావేశం చైన్నెలో జరిగింది. జాతీయ విద్యావిధానంలోని వివిధ అంశాలను ఇందులో చర్చించారు. అనేక సంస్థలు, విద్యావేత్తల భాగ స్వామ్యాన్ని ఆహ్వానించారు. పాలసీకి సంబంధించిన వివరాలను వివిధ వాటాదారుల మధ్య వ్యాపింప చేయడానికి, ఉన్నత విద్యా సంస్థల ద్వారా ఈ విధానం అమలును నిర్ధారించడానికి జరుగుతున్న ప్రయత్నాలను విశదీకరించారు. ప్రొఫెసర్ జగదీష్‌కుమార్ మాట్లాడుతూ విద్యాసంస్థలు ఉన్నత విద్యను నాణ్యతతో విద్యార్థులకు విజయవంతంగా అందించేందుకు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. అభ్యాస ఫలితాలను మెరుగుపరచడానికి భారతీయ భాషలను ఉన్న త విద్యలో బోధనను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ వి.కామకోటి మాట్లాడుతూ ఉన్నత విద్యా వ్యవస్థలో తమ గ్రాస్ ఎన్‌్‌రోల్‌మెంట్ రేషన్ దాదాపు 30% ఉందన్నారు. 2047 నాటికి సాంకేతికతపై మంచి అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉందన్నారు. రెగ్యులర్ సెమిస్టర్ పరీక్షలతో పాటు ఎండ్ సెమిస్టర్ పరీక్షను కూడా నిర్వహించేందుకు యూజీసీ యూనివర్సిటీలకు అనుమతించిందన్నారు. విద్యార్థులు తమ సమయం, డబ్బును ఆదా చేసుకోవాలంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించే ఎండ్–సెమిస్టర్ పరీక్షలకు దూరంగా ఉండాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment