సాక్షి, చైన్నె : మాజీ ప్రధాని నెహ్రూ జయంతిని కాంగ్రెస్ వర్గాలు వాడవాడల్లో గురువారం ఘనంగా జరుపుకున్నాయి. చైన్నె గిండిలోని నెహ్రూ విగ్రహానికి రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్ నేతలు అంజలి ఘటించారు. భారత తొలి ప్రధాని నెహ్రూ జయంతి సందర్భంగా ఆయన విగ్రహాలు, చిత్ర పటాలకు పూల మాలలు వేసి పుష్పాంజలి ఘటించారు. ఇక, రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లోనూ నెహ్రూను స్మరిస్తూ బాలల దినోత్సవ వేడుకలు జరిగాయి. సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఇక, గిండి కత్తిపార వంతెన వద్ద ఉన్న నెహ్రూ విగ్రహానికి ఉదయాన్నే మంత్రులు అన్బరసన్, నాజర్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సెల్వ పెరుంతొగై పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యాలయం సత్యమూర్తి భవన్‌లోనూ వేడుకలు జరిగాయి. వివిధ పార్టీల నేతలు నెహ్రూ విగ్రహం, చిత్ర పటాలకు నివాళులర్పించిన వారిలో ఉన్నారు. పిల్లలకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ సీఎం స్టాలిన్ ఎక్స్ పేజీలో ట్వీట్ చేశారు. అలాగే, తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్ సైతం శుభకాంక్షలు తెలియజేశారు. ఆపార్టీ ప్రధాన కార్యదర్శి భుస్సీ ఆనంద్ విద్యార్థులకు చాక్లెట్ల పంచిపెట్టారు. చైన్నెలోని ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు మంత్రి అన్బిల్‌మహేశ్, శేఖర్‌బాబు, మేయర్ ప్రియ చాక్లెట్లను అందజేశారు. ఈసందర్భంగా జరిగిన బాలల దినోత్సవ వేడుకలలో విద్యార్థులకు సర్టిఫికెట్లు, బహుమతులను అందజేశారు. విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment