సాక్షి, చైన్నె : జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ తమ కొత్త వాహనం కోసం ఆన్‌లైన్ బుకింగ్ నిమిత్తం వెబ్‌సైట్‌ను ప్రకటించింది. గురువారం ఈ వివరాలను ఆ సంస్థ ఇండియా హెడ్ బల్బీర్‌సింగ్ దిలాన్ స్థానికంగా ప్రకటించారు. కొత్త ఆడి క్యూ7 బుకింగ్‌లకు శ్రీకారం చుట్టనున్నామన్నారు. ఔరంగాబాద్‌లోని ఏవీడబ్ల్యూఐపీఎల్ ప్లాంట్‌లో ఈ వాహనం తయారు చేస్తున్నట్టు వివరించారు. నవంబర్ 28వ తేదీ నుంచి బుకింగ్‌లను ఆడి ఇండియా వెబ్‌సైట్‌లలో చేపట్టనున్నామని పేర్కొంటూ, ఆ వాహనంలోని అత్యాధునిక లగ్జరీ సేవలను గురించి వివరించారు.
డివిజన్ అకౌంట్
సహాయకుడు డిస్మిస్
సేలం: అవినీతికి పాల్పడిన డివిజన్ అకౌంట్ సహాయకుడిని డిస్మిస్ చేస్తూ వైద్య ఆరోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో డాక్టర్ ముత్తులక్ష్మిరెడ్డి ప్రసూతి ఆర్థిక సహాయం పథకం కింద పుదుకోట్టై జిల్లా కడియాంపట్టి ఆరోగ్య డివిజన్‌లో 5 ప్రభుత్వ ప్రాథమిక వైద్య కేంద్రాల్లో అక్రమాలు జరిగినట్టు తెలిసింది. ఈ క్రమంలో చైన్నె నుంచి బుధవారం వచ్చిన తనిఖీ బృందం కట్టియాప్పట్టి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసింది. ఇందులో కడియాంపట్టి ఆరోగ్యశాఖ సహాయక ఉద్యోగి వెంకటేశ్‌కుమార్, డివిజన్ అకౌంట్ సహాయకుడు అరుణ్‌లు 16 నకిలీ ఖాతాలను తెరిచి, వాటి ద్వారా రూ.18.60 లక్షలు మోసానికి పాల్పడిట్టు తెలిసింది. దీనికి సంబంధించి పుదుకోట్టై ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఆరోగ్యశాఖ అధికారి రామగణేష్ ఫిర్యాదు చేశారు. ఆ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ జరిపారు. ఇదిలా ఉండగా బుధవారం వెంకటేష్ కుమార్‌ను సస్పెండ్ చేసిన అధికారులు అరుణ్‌ను డిస్మిస్ చేశారు.
మోసం కేసులో మహిళ అరెస్టు
తిరువొత్తియూరు: కంపెనీలో పెట్టుబడి పెడితే రెట్టింపు ఆదాయం వస్తుందని నమ్మించి రూ.15 లక్షలు మోసం చేసిన మహిళను పోలీసులు అరెస్టు చేశారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. చైన్నె విల్లివాక్కం రాజాజీ నగర్ ప్రాంతానికి చెందిన మహాలక్ష్మి(41) ఓ కంపెనీలో పని చేస్తుంది. గోకుల్‌రాజ్ ద్వారా అతని భార్య సుచిత్ర (26), మహాలక్ష్మికి పరిచయం అయింది. సుచిత్ర గిండిలో ఒక సంస్థలో నగదు పెట్టుబడి పెడితే రెట్టింపు లాభం వస్తుందని తెలిపారు. దీంతో మహాలక్ష్మి, సుచిత్ర చెప్పిన సమస్థకు పలు దఫాలుగా రూ.15 లక్షల డిపాజిట్ చేసింది. నగదు తీసుకున్న తర్వాత సుచిత్రను సంప్రదించడానికి వీలు కాలేదు. దీంతో అనుమానించిన మహాలక్ష్మి, సుచిత్ర కార్యాలయానికి వెళ్లి చూడగా తాళం వేసి ఉంది. దీంతో దిగ్భ్రాంతి చెందిన ఆమె ఈ విషయమై రాజమంగళం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ క్రమంలో చైన్నె రెడిల్స్ ప్రాంతానికి చెందిన సుచిత్రను పోలీసులు అరెస్టు చేశారు. ఆమెను కోర్టులో హాజరపరిచిలో జైలులో పెట్టారు. దీనికి సంబంధించి మహమ్మద్ నసరుద్దీన్, మహమ్మద్ యూసఫ్ కోసం గాలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment