నవ భారతాన్ని నిర్మించుకుందాం..!
సాక్షి, చైన్నె: శాస్త్ర సాంకేతిక రంగాలలో భారత్ దూసుకెళ్తోందని, 2047 నాటికి నవభారతాన్ని నిర్మించుకుందాం అని కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ సహాయ మంత్రి ఎల్. మురుగన్ వ్యాఖ్యానించారు. చైన్నె మదుర వాయిల్ లోని డాక్టర్ ఎంజీఆర్ ఎడ్యుకేషనల్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ 33వ స్నాతకోత్సవ వేడుకల సెషన్స్ – 2 వేడుక ఆదివారం జరిగింది. స్థానిక వేలప్పన్ చావడిలోని ఏసీఎస్ వైద్య కళాశాల వేదికగా యూనివర్సిటీ చాన్స్‌లర్ డాక్టర్ ఏసీ షణ్ముగం అధ్యక్షతన ఎంబీబిఎస్, బీడీఎస్, ఎండీఎస్ బీఎస్సీ, ఎంబీఏ ఎంసీఏ తదితర కోర్సులలో యూజీ, పీజీ పీహెచ్‌డీలు పూర్తి చేసిన వారికి కేంద్ర సహాయ మంత్రి ఎల్. మురుగన్ డిగ్రీ, ర్యాంకులను ప్రదానం చేశారు. వర్సిటీ ప్రో వైస్ చాన్స్‌లర్ డాక్టర్ జి. గోపాల కృష్ణన్, వీసీ డాక్టర్ ఎస్. గీతా లక్ష్మీ వార్షిక నివేదికను, విద్యార్థుల వివరాలను వేడుకలో వివరించారు. అతిథులను ఇన్‌స్టిట్యూట్ ప్రెసిడెంట్ ఏసీఎస్ అరుణ్‌కుమార్ సత్కరించారు . ఇందులో రిజిస్ట్రార్ డాక్టర్ సీబీ పళనివేలు, సెక్రటరీ ఎ. రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
ముగ్గురికి గౌరవ డాక్టరేట్లు..
ఆయా రంగాల్లో విశిష్ట సేవలను అందిస్తున్న ముగ్గురు ప్రముఖులకు ఈ వేడుకలో గౌరవ డాక్టరేట్‌లను కేంద్ర మంత్రి మురుగన్ చేతుల మీదుగా ప్రదానం చేశారు. ఇందులో డాక్టర్ ఆఫ్ సైన్స్‌ను హైదరాబాద్‌కు చెందిన డీఆర్‌డీఎల్ శాస్త్రవేత్త డాక్టర్ జీఏ శ్రీనివా మూర్తికి అందజేశారు. అలాగే ప్రముఖ సినీ నటుడు యాక్షన్ కింగ్ అర్జున్, సినీ దర్శకులు పి. వాసుకు గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేశారు. ఈసందర్భంగా కేంద్ర మంత్రి మురుగన్ మాట్లాడుతూ 2047 నాటికి 100వ స్వాత్రంత్య దినోత్సంను భారత్ జరుపుకోనుందన్నారు. ఈ సమయానికి భారత్ ప్రపంచానికే మార్గదర్శకంగా నిలవబోతోందని వ్యాఖ్యలు చేశారు. ఆ దిశగా ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం డిజిటల్ యుగంలో దూసుకెళ్తోందన్నారు. స్టార్టప్‌ల విస్తృతం అవుతున్నాయని, నవ భారత నిర్మాణం దిశగా అడుగుల వేగం పెరిగిందన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పనలో విద్యాసంస్థలు సైతం కీలక పాత్రను పోషించాలని సూచించారు.
కేంద్ర మంత్రి మురుగన్ వ్యాఖ్య
నటుడు అర్జున్‌కు గౌరవ డాక్టరేట్ ప్రదానం
Comments
Please login to add a commentAdd a comment