కులమతాలకు అతీతంగా జీవిద్దాం
● రాష్ట్ర గవర్నర్ ఆర్‌ఎన్ రవి
కొరుక్కుపేట: కులమతాలకు అతీతంగా మనమంతా జీవించాలని రాష్ట్ర గవర్నర్ ఆర్ ఎన్ రవి పిలుపునిచ్చారు. చైన్నె హిందూ ప్రచారక్ సంఘ్, డీఏవీ కళాశాల –అజ్మిర్, రాజ్ భవన్ తమిళనాడు సంయుక్తంగా కలసి రెండురోజులు పాటు అంతర్జాతీయ సదస్సు నిర్వహించారు. రాజ్ భవన్ వేదికగా రాష్ట్ర గవర్నర్ ఆర్ ఎన్ రవి ఈ సదస్సును శనివారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ దేశంలోని ప్రజలంతా ఒకే కుటుంబం అని వ్యాఖ్యానిస్తూ కులమతాలకు అతీతంగా జీవించాలని పిలుపునిచ్చారు. ప్రొఫెసర్ ఎన్. లక్ష్మీ అయ్యర్, డాక్టర్ కేటీ మురుగేశన్, ప్రొఫెసర్ సంజయ్ అరోరా సాఽరథ్యంలో ఈ సదస్సు నిర్వహించగా దాదాపు 200 మంది పాల్గొన్నారు. వేమన, తిరువళ్లూవర్, కబీర్‌దాస్ గురించి సదస్సులు నిర్వహించిన పలువురు ప్రసంగించారు. ఇందులో రిటైర్డ్ ఉపాధ్యాయురాలు డాక్టర్ ఏవి శివకుమారి కబీర్‌దాస్, యోగి వేమన గురించి ప్రసంగించారు. ఆదివారంతో ఈ సదస్సు విజయవంతంగా ముగియగా అందరికీ ప్రశంసాపత్రాలను అందజేశారు. డీఆర్‌బీసీసీసీ హిందూ కళాశాల తెలుగు అధ్యాపకురాలు టి. కల్పనాగుప్తా తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment