24న చైన్నె హాఫ్‌ మారథాన్‌ | - | Sakshi
Sakshi News home page

24న చైన్నె హాఫ్‌ మారథాన్‌

Published Fri, Nov 22 2024 1:50 AM | Last Updated on Fri, Nov 22 2024 1:50 AM

24న చైన్నె హాఫ్‌ మారథాన్‌

24న చైన్నె హాఫ్‌ మారథాన్‌

సాక్షి, చైన్నె: ఆరు వేల మంది రన్నర్లతో పాటు ఔత్సాహికులతో చైన్నె హాప్‌ మారథాన్‌ ఈనెల 24వ తేదీన జరగనుంది. 6వ ఎడిషన్‌గా జరగనున్న ఈ మారథాన్‌ గురించి నిర్వాహకులు ప్రతాప్‌ సింగ్‌, రెముస్‌ డీ క్రూజ్‌, నాగరాజ్‌ అడిగ గురువారం స్థానికంగా జరిగిన సమావేశంలో వివరించారు. ఎన్‌ఈబీ స్పోర్ట్స్‌ , అపోలో టైర్స్‌ ఆధారిత ఈ కార్యక్రమానికి అన్ని రంగాలకు చెందిన రన్నర్లు తమ పేర్లును నమోదు చేసుకున్నారని వివరించారు. బీసెంట్‌ నగర్‌ ఓల్కాట్‌ మెమోరియల్‌ హైస్కూల్‌ గ్రౌండ్‌ నుంచి చైన్నె నగరంలో పలు మార్గాల గుండా ఈ మారథాన్‌ జరగనున్నట్లు తెలిపారు. ఉదయం 4.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ రన్‌ 7 గంటల వరకు వివిధ కేటగిరీలలో జరగనున్నట్టు వివరించారు. చైన్నె హాఫ్‌ మారథాన్‌కు నగరంలోని రన్నింగ్‌ కమ్యూనిటీలోని వారే కాకుండా కార్పొరేట్‌ తదితర రంగాలకు చెందిన వారు సిద్ధమవుతున్నారని పేర్కొన్నారు. ఫిట్‌నెస్‌, ఆరోగ్యకరమైన జీవనశైలి, సమాజ హితం కాంక్షించే విధంగా ఈ రన్‌ ఉంటుందన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement