తల్లులం అంటూ తస్కరిస్తున్నారు!
● భిక్షాటన కోసం చిన్నారులను దొంగిలిస్తున్న ఉత్తరాది మహిళలు ● వారం వ్యవధిలో ఏడుగురు పిల్లల రక్షించిన పోలీసులు ● ముగ్గురు నిందితుల అరెస్ట్
అన్నానగర్: చైన్నె కోస్ట్–తాంబరం మార్గంలో నడుస్తున్న ఎలక్ట్రిక్ రైళ్లలో చాలా మంది ‘మహిళలు’ తమ చేతుల్లో పసిపాపతో నడుస్తున్నారు. ఆ పిల్లలు సరైన పోషకాహారం, సంరక్షణ లేకుండా దుర్భరంగా ఉంటున్‌న్రాు. ఈ తరహా భిక్షాటన చేస్తున్న మహిళల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో తాంబరం రైల్వే పోలీసులు, రైల్వే సెక్యూరిటీ గార్డులు భిక్షాటన చేస్తున్న ఈ మహిళలను గుర్తించి వారిలో కొందరిని విచారించారు. అప్పుడు వారి వద్ద ఉన్న వారు తమ పిల్లలు కాదని, దొంగిలించిన పిల్లలని తేలింది. దీంతో ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ రాష్ట్రాలకు చెందిన ముగ్గురు మహిళలను అరెస్టు చేశారు. వారికి ఉన్న పిల్లలను కూడా స్వాధీనం చేసుకున్నారు. గత వారం రోజుల్లోనే చెంగల్‌పట్టులో ఇలా ఏడుగురు శిశువులు సురక్షితంగా రక్షించి కేంద్రానికి అప్పగించారు. కాగా ఈ శిబిరాల్లో ఉన్న పిల్లలను రక్షించేందుకు ఏ మహిళ ఆసక్తి చూపడం లేదు. విచారణలో పిల్లల అసలైన తల్లిదండ్రులు ఎవరో కనుక్కోలేకపోయారు. దీంతో పోలీసులు ప్రజలను అప్రమత్తం చేశారు. పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని, ఇలా అడుక్కునే మహిళలను ప్రోత్సహించవద్దని హెచ్చరిస్తున్నారు. రైళ్లలో లేదా బహిరంగ ప్రదేశాల్లో మహిళలు పిల్లలతో అడుక్కోవడం చూస్తే పోలీస్ హెల్ప్‌లైన్ నెం. 139లో సంప్రదించి సమాచారం ఇవ్వవచ్చని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment