ఎన్‌సీసీ దినోత్సవం
అధికారుల వీర వందనం
● వార్ మోమోరియల్‌లో వీర వందనం
సాక్షి, చైన్నె: చైన్నె మెరీనా తీరం మార్గంలోని కామరాజర్ సాలైలలో ఉన్న వార్‌మెమోరియల్ స్తూపం వద్ద ఎన్‌సీసీ దినోత్సవ కార్యక్రమం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా వీరులకు వీరవందనం సమర్పించే విధంగా కార్యక్రమాలు జరిగాయి. ప్రపంచంలోనే అతి పెద్ద యువ సైన్యంగా ఎన్‌సీసీ 1948 నవంబర్ 24వ తేదీన ఆవిర్భవించినట్టు అధికారులు వివరించారు. 76వ వార్షికోత్సవ వేడుకను యుద్ధంలో మరణించిన వీరులకు జ్ఞాపకార్థం వీర వందనం సమర్పించే రీతిలో కార్యక్రమాలను నిర్వహించారు. ఆర్మీ లెప్టినంట్ జనరల్ కరణ్ బీర్ సింగ్ వార్ మెమోరియల్ వద్ద పుష్పగుచ్ఛం ఉంచి గౌరవ వందనం సమర్పించారు. దక్షిణ భారత ఏరియా జనరల్ ఆఫీసర్ కమాండింగ్ లెప్టినెంట్ జనరల్ కేఎస్ బ్రార్, ఎన్‌సీసీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఎస్ రాఘవ్ వీరవందనం సమర్పించారు. ఎన్‌సీసీ కెడెట్లు, కమాండర్లు, ఆర్మీ వర్గాలు హాజరయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment