గెలుపే ధ్యేయంగా చేతులు కలుపుదాం .. | - | Sakshi
Sakshi News home page

గెలుపే ధ్యేయంగా చేతులు కలుపుదాం ..

Published Tue, Nov 26 2024 2:09 AM | Last Updated on Tue, Nov 26 2024 2:09 AM

గెలుపే ధ్యేయంగా చేతులు కలుపుదాం ..

గెలుపే ధ్యేయంగా చేతులు కలుపుదాం ..

యువజనులకు ఉదయనిధి పిలుపు

సాక్షి, చైన్నె: 2026 ఎన్నికలలో బ్రహ్మాండమైన గెలుపుతో మళ్లీ అధికారం చేజిక్కించుకునేందుకు యువ జనలోకం తనతో చేతులు కలపాలని డీఎంకే యువజన విభాగం ప్రధా న కార్యదర్శి, డిప్యూటీ సీఎం ఉదనిధి స్టాలిన్‌ పిలుపునిచ్చారు. ఈ నెల 27వ తేదీన తన జన్మదినాన్ని పురస్కరించుకుని సోమవారం యువజనులకు ఉదయనిధి స్టాలిన్‌ లేఖ రాశా రు. తన పుట్టినరోజు సందర్భంగా తమిళనాడు అంతటా వివిధ కార్యక్రమాలకు సిద్ధమైన యువ సమూహానికి కృతజ్ఞతలు అని ఆ లేఖలో ముందుగా వ్యాఖ్యానించారు. తమ ఇంటి బిడ్డగా తనను భావించి సంబరాలు చేసుకుంటూ ఆనందం వ్యక్తం చేస్తున్న ప్రతి హృదయానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ బర్‌తడే వేళ యువ సమూహం అంతా ఒక ప్రతిజ్ఞ చేయాలని పిలుపునిచ్చారు. 2026లో జరిగే ఎన్నికలలో మళ్లీ అధికార పగ్గాలు చేపట్టడం లక్ష్యంగా యువ సమూహం తన వెన్నంటి కదిలే విధంగా ప్రతిజ్ఞబూనాలని కోరారు. ద్రావిడ మోడల్‌ ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమాలను విస్తృతం చేయాలన్నారు. తమను తాము అంకితం చేసుకుంటూ యువజన విభాగం నేతలందరూ కలిసి కట్టుగా శ్రీపేదల చిరునవ్వులో భగవంతుడిని వెతుకుదాం్ఙ అ న్న నినాదంతో నిరుపేదలు, బడుగు బలహీ న వర్గాల వారికి సంక్షేమం కోసం శ్రమిద్దా మని పిలుపునిచ్చారు. ఇదిలా ఉండగా ఉదయనిధి బర్త్‌డే సందర్భంగా పెయింటింగ్‌ ఆర్టిస్టు శివరామన్‌ నేతృత్వంలో వంద మంది వి ద్యార్థులు కలసికట్టుగా 5 వేల చదరపు అడుగులతో ఆయన ముఖచిత్రాన్ని చేతి వేళ్ల తో చైన్నెలో జరిగిన కార్యక్రమంలో సోమ వారం తీర్చిదిద్దారు. ఈనెల 27వ తేదీ నుంచి డిసెంబరు 26వ తేదీ వరకు ప్రభుత్వ ఆస్పత్రులలో జన్మించి పిల్లలకు బంగారు ఉంగరాలను అందజేయడానికి డీఎంకే యువజన విభాగం నేతలు నిర్ణయించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement