● మెట్రో అధికారుల వెల్లడి
కొరుక్కుపేట: చైన్నెలో ప్రతిష్టాత్మకంగా సాగుతున్న ఫేజ్– 2 మెట్రో రైలు ప్రాజెక్టు, 116 కిలోమీటర్లలో మూడు మార్గాలుగా నిర్వహిస్తున్నారు. వీటిలో మాధవరం – సిరుచ్చేరి నుంచి సిప్‌కోట్‌కు వెళ్లే 3వ మార్గం పనులు శరవేగంగా సాగుతున్నాయి . ఇందులో 28 భూగర్భ మెట్రో రైలు స్టేషన్లు , 19 ఎలివేటెడ్ మెట్రో స్టేషన్లు ఉన్నాయి. ఈ మార్గంలో అయనవరం, చేట్‌పేట, రాయపేట, అడయార్ సహా పలు ప్రాంతాల్లో టన్నెలింగ్ పనులు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా అయనవరం–పెరంబూరు మధ్య మెట్రో రైలు సొరంగం పనులు జరుగుతున్నాయి. అయనవరం నుంచి పెరంబూరు వరకు కాల్వ రాయన్ యంత్రం జనవరిలో పెరంబూర్ మెట్రో రైలు స్టేషన్‌కు చేరుకునే అవకాశం ఉంది. దీని గురించి మెట్రో అఽధికారులు మాట్లాడుతూ అయనవరం–పెరంబూరు మెట్రో రైలు సొరంగం పనుల్లో ఇప్పటి వరకు 866 మీటర్ల మేర ‘కాల్వ రాయన్’ యంత్రం తవ్వింది. అలాగే పెరంపూర్ రైల్వే స్టేషన్ నిర్మాణంలో కొంత భాగం పురోగతిలో ఉంది. ఈ పని పూర్తయితే జనవరి నెలాఖరు నాటికి ‘కాల్వ రాయన్’ యంత్రం పెరంబూర్ స్టేషన్‌కు చేరుకుంటుంది. పెరంపూర్ వద్ద సబర్బన్ రైల్వే కింద టన్నెల్ నిర్మాణంలో కాల్వరాయన్ యంత్రం నిమగ్నమై ఉందని, సదరన్ రైల్వే విధించిన ఆంక్షల ప్రకారం పనులు జరుగుతాయని, ఈ ప్రాంతంలో టన్నెల్ నిర్మాణాన్ని నిశితంగా పరిశీలిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment