ముదునగర్ పోలీస్ స్టేషన్‌లో డిప్యూటీ సీఎం తనిఖీలు
సాక్షి, చైన్నె: కడలూరు జిల్లా ముదునగర్ పోలీస్ స్టేషన్‌లో డిప్యూటీ సీఎం ఎంకే స్టాలిన్ సోమవారం తనిఖీలు చేశారు. కడలూరు జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన హఠాత్తుగా పోలీసు స్టేషన్‌లో సోదాలకు వెళ్లారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఉన్న ఫిర్యాదు దారులతో మాట్లాడారు. అక్కడ కల్పించిన ఏర్పాట్లును, సిబ్బంది స్టేషన్‌లో విధులలో ఉన్నారా? అని పరిశీలించారు. హాజరు పట్టిక, వినతి పత్రాలు అందజేసిన వారి వివరాలు, సమస్యల పరిష్కారం గురించి ఆరాతీశారు. అలాగే మహిళా సిబ్బంది వారికి ఒక రోజు సెలవు మంజూరు చేస్తున్నారా? అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం కడలూరులో జరిగిన కార్యక్రమంలో రూ. 23.93 కోట్లు విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. 12,100 మంది లబ్ధిదారులకు సంక్షేమ పథకాలను అందజేశారు. క్రీడాకారులకు కిట్లను అందజేశారు. కార్యక్రమంలో మంత్రులు ఎంఆర్‌కే పన్నీరు సెల్వం, గణేషన్, ఎంపీ విష్ణు ప్రసాద్, ఎమ్మెల్యేలు సబా రాజేంద్రన్, ఎంఆర్ రాధాకృష్ణన్, సింతనై సెల్వన్, క్రీడల శాఖ కార్యదర్శి అతుల్య మిశ్రా, స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ అథారిటీ సీఈఓ జె. మేఘనాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment