సేలం : ఇటీవల అన్నాడీఎంకే సమావేశాలలో నేతలకు, నిర్వాహకులకు మధ్య మధ్య గొడవలు నిత్యకృత్యంగా మారాయి. ఈ క్రమంలో సోమవారం మదురైలో జరిగిన సమావేశంలో కూడా గొడవ చోటు చేసుకుంది. వివరాలు.. మదురై కామరాజర్ సాలైలో సోమవారం అన్నాడీఎంకే నగర జిల్లా పార్టీ తరపున సమావేశం జరిగింది. అన్నాడీఎంకే నగర జిల్లా కార్యదర్శి సెల్లూర్ రాజూ అధ్యక్షత వహించారు. ఇందులో మాజీ మంత్రి అన్నాడీఎంకే పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి నత్తం ఆర్.విశ్వనాథన్, నేత సెమ్మలై తదితరులు పాల్గొన్నారు. సమావేశం ప్రారంభమైన కొంత సమయానికే ప్రసంగించడానికి అవకాశం ఇవ్వలేదంటూ కొందరు నిర్వాహకులు నేతలతో వాగ్వాదానికి దిగారు. ఆ సమయంలో నేతలు, నిర్వాహకులు, కార్యకర్తల మధ్య బాహాబాహీ చోటు చేసుకుంది. ఈ ఘటనలకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాలలో వైరల్గా మారాయి.
Comments
Please login to add a commentAdd a comment