నకిలీ పత్రాలతో రూ. 2.50 కోట్ల కారు విక్రయం | - | Sakshi
Sakshi News home page

నకిలీ పత్రాలతో రూ. 2.50 కోట్ల కారు విక్రయం

Published Tue, Nov 26 2024 2:10 AM | Last Updated on Tue, Nov 26 2024 2:10 AM

-

● మోసపోయిన చైన్నె వ్యాపారవేత్త

కొరుక్కుపేట: చైన్నె నుంగంబాక్కంకు చెందిన అభిషేక్‌ (35) ప్రముఖ వ్యాపార వేత్తగా ఉన్నారు . అతడికి 2017 నుంచి అరుంబాక్కంకు చెందిన రోషన్‌ ,రోహిత్‌ మంచి సేహితులు. ఈ క్రమంలో అభి షేక్‌ ఖరీదైన లగ్జరీ కారు కొనాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయాన్ని తన స్నేహితులు రోషన్‌, రోహిత్‌కు చెప్పాడు. ఆ సమయంలో రోహిత్‌ తనకు తెలిసిన లగ్జరీ కార్‌ డీలర్లను సంప్రదించి కారును కొనుగోలు చేసేలా చేశారు. ఇంతలో కొనుగోలు చేసిన లగ్జరీ కారును జప్తు చేసేందుకు అధికారులు వచ్చారు. ఆ సమయంలో అభిషేక్‌ తాను కొనుగోలు చేసిన కారుకు డబ్బులు ఇచ్చానని అధికారులకు చెప్పడంతో అందుకు కుదుర్చుకున్న అగ్రిమెంట్లను బ్యాంకు అధికారులకు చూపించాడు. ఆ తర్వాత రోహిత్‌ తాను ఉపయోగించిన లగ్జరీ కారును మోసపూరితంగా విక్రయించినట్లు వెలుగులోకి వచ్చింది. అభిషేక్‌ సంబందిత పత్రాలతో పాటు పోలీసు కమిషనర్‌ అరుణ్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై విచారణ చేపట్టాలని కమిషనర్‌ అరుణ్‌ నుంగంబా క్కం పోలీసులను ఆదేశించారు. పోలీసులు విచారణ జరిపి వ్యాపారికి రూ.2.50 మోసం చేసిన రోషన్‌,రోహత్‌పై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement