ఉదయనిధికి బ్రహ్మరథం
సాక్షి, చైన్నె: డీఎంకే వారసుడు, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ బుధవారం 47వ వసంతంలోకి అడుగు పెట్టారు. డిప్యూటీ సీఎం హోదాలో తొలి బర్త్‌డేను ఉదయనిధి జరుపుకోవడంతో ఆయన నేతృత్వం వహిస్తున్న యువజన విభాగం వర్గాలు సంబరాలు చేసుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉదయోత్సవం పేరిట వేడుకలను నిర్వహించారు. పేదలకు సంక్షేమ, సహాయకాలను పంపిణీ చేశారు. వివరాలు.. రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి, డీఎంకే యువజన విభాగం ప్రధాన కార్యదర్శి ఉదయ నిధి స్టాలిన్‌కు గత బర్త్‌డే సందర్భంగా డిప్యూటీ సీఎం పదవీ ఇవ్వాలనే నినాదం మిన్నంటిన విషయం తెలిసిందే. ఎట్టకేలకు లోక్‌సభ ఎన్నికల అనంతరం ఆయనకు ప్రమోషన్ దక్కింది. డిప్యూటీ సీఎంగా, డీఎంకే యువజన విభాగం ప్రధాన కార్యదర్శిగా ఆయన దూసుకెళ్తున్నారు. ప్రజలతో మమేకం అయ్యే విధంగా రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలలో నిమగ్నమమ్యారు. ఈ పరిస్థితుల్లో బుధవారం ఆయన 47వ వసంతంలోకి అడుగు పెట్టారు. ఆయన బర్త్‌డేను డీఎంకే యువజన విభాగం వాడవాడలలో సేవా కార్యక్రమాల రూపంలో జరుపుకున్నాయి. ఉదయోత్సవం పేరిట సంబరాలలో మునిగాయి. ఉదయాన్నే తండ్రి, సీఎం స్టాలిన్, తల్లి దుర్గా ఆశీస్సులను ఉదయనిధి అందుకున్నారు. కుటుంబంతో కలిసి ఆనందాన్ని పంచుకున్నారు. అనంతరం మెరీనా తీరంలోని దివంగత సీఎం అన్నాదురై, దివంగత నేత, తాతయ్య కరుణానిధి సమాధి వద్ద నివాళులర్పించారు. ద్రవిడ సిద్ధాంతకర్త పెరియార్ దిడల్ వద్ద అంజలి ఘటించారు. గోపాలపురంలో ఉన్న నానమ్మ దయాళుల అమ్మాల్, సీఐటీ నగర్‌లో మరో అవ్వరాజాత్తి అమ్మాల్ ఇంటికి వెళ్లి ఆశీస్సులు అందుకున్నారు.
యువజన విభాగం నేతృత్వంలో బర్త్‌డే సంబరాలు
47వ వసంతంలోకి ఉదయనిధి
తల్లిదండ్రులు ఆశీస్సులు
వాడవాడలా ఉదయోత్సవం పేరిట వేడుకలు
సంబరాలు..
డీఎంకే యూత్ నేతృత్వంలో ఉదయనిధి బర్త్‌డే సంబరాల కార్యక్రమం చైన్నెలో పలు చోట్ల జరిగింది. మంత్రులు శేఖర్‌బాబు, ఎం. సుబ్రమణియన్, ఏవీవేలు, అన్బిల్ మహేశ్ నేతృత్వంలో పలుచోట్ల జరిగిన సేవా కార్యక్రమాలకు ఉదయనిధి హాజరయ్యారు. అలాగే డీఎంకే ప్రధాన కార్యాలయంలో అభిమానులు, యువజన నేతలు, కార్యకర్తలను ఉదయనిధి కలిశారు. ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ కేడర్ కానుకలను అందజేశారు. ఇక డీఎంకే కూటమి పార్టీల నేతలు ఉదయనిధికి బర్త్‌డే శుభాకాంక్షలు తెలియజేవారు.
Comments
Please login to add a commentAdd a comment