ప్రపంచ మూలాలకు భారతీయ ఇంజినీరింగ్
కొరుక్కుపేట: భారతీయ ఇంజినీరింగ్‌ను ప్రపంచంలోని ప్రతి మూలకు తీసుకెళ్లడంలో ఈఈపీసీ కీలక పాత్ర పోషిస్తుందని భారత ప్రభుత్వ వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ జాయింట్ సెక్రటరీ విమల్ ఆనంద్ అన్నారు. ఈమేరకు ఈఈపీసీ ఆధ్వర్యంలో చైన్నె ట్రేడ్ సెంటర్ వేదికగా మూడు రోజుల అంతర్జాతీయ ఇంజినీరింగ్ సోర్సింగ్ షో (ఐఈఎస్‌ఎస్ –12)ను బుధవారం ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ భారతీయ ఇంజినీరింగ్ ఆధునిక సాంకేతికతో దూసుకుపోతుందని అన్నారు. ఇంజినీరింగ్ షో విజయవంతం కావాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రభుత్వ ఎంఎస్‌ఎంఈ ప్రిన్సిపల్ సెక్రటరీ అతుల్ ఆనంద్, ఈఈపీసీ ఇండియా చైర్మన్ పంకజ్ చడ్డా, వైస్ చైర్మన్ ఆకాష్‌షా పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment