అన్నానగర్: చిదంబరంలో మంగళవారం రాత్రి వైద్య విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వివరాలు.. క్రిష్ణగిరి జిల్లా, హోసూరు, తిరుపతి నగర్ తూర్పుకు చెందిన శ్రీధర్ కుమార్తె రక్షనా (28). కోయంబత్తూరులో బిడీఎస్ పూర్తి చేసిన తర్వాత, ఆమె చిదంబరం ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎండీఎస్ కోర్సులో చేరింది. ఈ విద్యార్థిని తన తోటి విద్యార్థులతో కలిసి ఓ ఇంటిని అద్దెకు తీసుకుని కాలేజీకి వెళ్లి వస్తోంది. రక్షనా తరచూ కడుపునొప్పితో బాధపడుతోందని తెలుస్తుంది. మంగళ వారం రాత్రి ఒక్కసారిగా కడుపునొప్పి రావడంతో తల్లితో మాట్లాడింది. ఆ తర్వాత అక్కడే ఉన్న స్నేహి తులు బయటకు వెళ్లి తిరిగి వచ్చే సరికి చీరతో ఉరేసు కుని ఆత్మహత్యకు పాల్పడింది. విద్యార్థిని తండ్రి శ్రీధర్ ఫిర్యాదు మేరకు అన్నామలైనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మద్యం మత్తులో మహిళ హల్‌చల్
అన్నానగర్: కరూర్ బస్ స్టేషన్ సమీపంలో మంగళవారం ఉదయం 40 ఏళ్ల మహిళ మద్యం మత్తులో వీరంగం సృష్టించింది. దీంతో ప్రజలు పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం అక్కడికి చేరుకున్న పోలీసులు మహిళను విచారించారు. ఇందులో తిరుపూర్ జిల్లా పల్లడంకు చెందిన మహిళ అని, రూ.5 వేలు ఎవరో మోసం చేశారని ఆ డబ్బును రికవరీ చేసేందుకు గొడవకు దిగినట్లు తెలిసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
756 విదేశీ మద్యం బాటిళ్లు స్వాధీనం
అన్నానగర్: ఆత్తూరు సమీపంలో బుధవారం కారుతో పాటు 756 విదేశీ మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వివరాలు.. తూత్తుకుడి జిల్లా, అత్తూరు పోలీస్ స్టేషన్ అసిస్టెంట్ ఇన్‌న్‌స్పెక్టర్ కుమార్, పోలీసులు బాలమురుగన్, మునియస్వామి బుధవారం వేకువజామున పూమంగళం ముత్తారమ్మన్ ఆలయం దగ్గర గస్తీకి వెళ్లారు. అనంతరం ఆ ప్రాంతంలో ఎవరూ లేకుండా పార్క్ చేసిన కారును సోదా చేశారు. అందులో 756 విదేశీ మద్యం బాటిళ్లను దాచి ఉంచినట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. కారు యజమాని చోళీయాకురిచ్చి కురుంబూర్‌కు చెందిన తంగపాండి కుమారుడు మురుగన్ కోసం గాలిస్తున్నారు.
నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక దాడి
తిరువొత్తియూరు: నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక దాడి చేసిన వ్యక్తికి ప్రత్యేక కోర్టు 20 ఏళ్లు జైలు శిక్ష విధించింది. విల్లుపురం సమీపం వలవనూర్ అంబేడ్కర్ వీధికి చెందిన తనికై య్ వేల్ (38), ఇతను గత 2018 ఏళ్ల అదే ప్రాంతానికి చెందిన నాలుగేళ్ల బాలికపై లైంగిక దాడి చేశాడు. దీని గురించి వలవనూరు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు 30.6.2018లో తనికై వేలు పై పోక్సో చట్టం కేసు నమోదు చేసి అతని అరెస్టు చేశారు. ఈ కేసు విచారణ విల్లుపురం ప్రత్యేక కోర్టులో జరుగుతూ వచ్చింది. ఈక్రమంలో బుధవారం న్యాయమూర్తి వినోద తీర్పు ఇచ్చారు. నిందితుడు తనికై వేల్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష రూ. 10 వేలు జరిమానా విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. అలాగే బాధింపబడిన చిన్నారి కుటుంబానికి ప్రభుత్వం తరపున రూ. 7 లక్షలు పరిహారం అందజేయాలని పేర్కొన్నారు. దీంతో తనికై వేల్‌ను కడలూరు సెంట్రల్ జైలులో పెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment