4వ అంతస్తు నుంచి జారి పడి విద్యార్థిని దుర్మరణం
అన్నానగర్: చైన్నె సమీపంలోని మడిపాక్కం సౌత్ రాంనగర్ ప్రాంతానికి చెందిన యోగేశ్వరన్ కూ మార్తె హరిణి (15). వేళచ్చేరిలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. ఈ స్థితిలో బుధవారం బట్టలు ఆరబెట్టేందుకు హరిణి 4వ అంతస్తులోని తన నివాసం టెర్రస్ పైకి వెళ్లింది. బట్టలు తీసేందుకు ప్రయత్నిస్తుండగా 4వ అంత స్తు నుంచి జారి కిందపడింది. ఆమె తుంటి ఎము క విరిగిపోయింది. వెంటనే ఇరుగుపొరుగు వారు ఆమెను రక్షించి చికిత్స నిమిత్తం పల్లికరనైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. మడిపాక్కం పోలీసులు కేసు నమోదు చేసి హరిణి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం క్రోంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ప్రభుత్వ బస్సు ఢీకొని
దంపతులు..
అన్నానగర్: విరుదునగర్ జిల్లా రాజపాళ్యం సమీపంలోని సమత్తువపురం ప్రాంతానికి చెందిన మహ్మద్ ఘస్సాలీ (38). ఇతని భార్య నూరూల్ ఫాతిమా (28). వీరికి 4, 6 ఏళ్ల ఇద్దరు కుమారులు ఉన్నారు. మహ్మద్ ఘస్సాలీ వస్త్ర వ్యాపారి. నూరుల్ ఫాతిమా దిండుక్కల్ జిల్లా కొడైకెనాల్‌లో విద్యాశాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో భార్యాభర్తలిద్దరూ బుధవారం బైకులో రాజపాళెం నుంచి శ్రీవిల్లిపుత్తూరు వెళ్తున్నారు. వీరి బైకు మదురై–కొల్లాం జాతీయ రహదారిపై వన్నియంబట్టి పోలీస్ స్టేషన్ సమీపంలో వస్తుండగా శ్రీవిల్లిపుత్తూరు నుంచి పాపనాశం వైపు వస్తున్న ప్రభుత్వ బస్సు ఢీ కొట్టింది. గాయపడిన దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఇద్దరి మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం ని మిత్తం శ్రీవిల్లిపుత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వన్నియంబట్టి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
పోక్సోచట్టం కింద అరెస్టయిన వృద్ధుడు అనారోగ్యంతో..
తిరువొత్తియూరు: పోక్సో చట్టం కింద అరెస్టయి పులల్ జైలులో ఉన్న వృద్ధుడు మృతి చెందాడు. వివరాలు.. చైన్నె, కీల్ కట్టనై సమీపము నన్మంగళానికి చెందిన విజయ్ కుమార్ (63) ఇతన్ని సేలయూరు పోలీసులు పొక్సో చట్టం కింద అరెస్టు చేసి పులల్ జైల్లో పెట్టారు. ఈ క్రమంలో అతనికి హఠాత్తుగా అనారోగ్యంతో ఏర్పడింది. పోలీసులు అతన్ని చికిత్స కోసం స్టాన్లీ ప్రభుత్వాసుపత్రిలో చేర్చారు అక్కడ చికిత్స పొందుతూ విజయ్ కుమార్ బుధవారం మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment