శ్రీశాంతి గురుదేవ్ మహారాజ్ అవరోహణ దినోత్సవం
వేలూరు: వేలూరు పట్టణంలో మేరి కాళియమ్మన్ ఆలయ వీధిలోని శ్రీశాంతి గురుదేవ్ మహారాజ్ 135వ జయంతి దినోత్సవంతో పాటూ 120 అవరోహణ దినోత్సవ కార్యక్రమం ఆదివారం ఉదయం జరిగింది. ముందుగా మెయిన్ బజారు నుంచి జెండాను ఎగరవేసి ఊరేగింపును ప్రారంభించారు. అనంతరం గాంధీ రోడ్డు, శెట్టివీధి తదితర వీధుల్లో ఊరేగింపు జరిగింది. ఇందులో కర్ణాటక, రాజస్తాన్, ఛత్తీస్‌గడ్ వంటి రాష్ట్రాలకు చెందిన జైన్ మతస్తులు నృత్యం చేయడంతో పాటూ పాటలు పాటడి ఆకట్టుకున్నారు. అనంతరం వృద్దాశ్రమం, అనాథ ఆశ్రమాల్లో అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ గురుదేవ్ భక్త మండలి అధ్యక్షులు శ్రీశాంతిలాల్ కులేచా, కార్యదర్శి విజయకుమార్ కటారియా, కోశాధికారి దినేష్ కుమార్ భట్టేవాడ, శ్రీశాంతి మండలి అధ్యక్షులు విజయకుమార్, కార్యదర్శి దిలీఫ్ కులేచ, కోశాధికారి పూనం కులేచా, ఆర్గనైజర్ సుభాష్‌జైన్ పత్వేద పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment