రీల్ కాదు రియల్ !
తమిళసినిమా: నటి కీర్తిసురేష్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయనే చెప్పాలి. బాల నటిగా సినీ రంగప్రవేశం చేసిన నట వారసురాలు ఈ చిన్నది అనే విషయం తెలిసిందే. అమ్మ నటి మేనక. నాన్న సురేష్ నిర్మాత. కీర్తిసురేష్ సినీ రంగ ప్రవేశం స్వల్పంగానే జరిగి ఉండొచ్చు. అయితే సక్సెస్‌ఫుల్ కథానాయకి కావడంలో మాత్రం ఈమె ప్రతిభ చాలానే ఉంది. అందం, అభినయం రెండు మెండుగా కలిగిన కీర్తిసురేష్. అందుకే అతి తక్కువ సమయంలోనే హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రాల్లో నటించడం, జాతీయ ఉత్తమ నటి అవార్డును గెలుచుకోవడం జరిగిపోయింది. అదేవిధంగా చాలామంది నటీమణుల కంటే ముందుగానే పెళ్లి కూడా చేసుకున్నారు. తన బాయ్‌ఫ్రెండ్ ఆంటోనీతో గత డిసెంబర్‌లో గోవాలో ఈమె పెళ్లి జరిగింది. వెంటనే ఈమె నటించిన తొలి హిందీ చిత్రం బేబీ జాన్ ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కాగా తాజాగా మరోసారి భర్త ఆంటోనితో కలిసి మెహిందీ (గోరింటాకు )వేడుకను అదే గోవాలో అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. చాలా కలర్‌ఫుల్‌గా జరిగిన ఈ వేడుకలో కీర్తిసురేష్ తన భర్తతో కలిసి ఉప్పొంగిన ఆనందంతో డాన్స్ చేసి ఎంజాయ్ చేశారు. విశేషం ఏంటంటే ఆమెతో పాటు భర్త ఆంటోని కూడా స్టెప్స్ వేయడం. ఆ ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఇకపోతే ఈమె కొత్త చిత్రాల్లో నటించడం లేదు. కొత్త అవకాశాలు రావడం లేదా, లేక ఈ బ్యూటీ అంగీకరించడం లేదా అనే విషయాన్ని పక్కన పెడితే ఇప్పటికే నిర్మాణంలో ఉన్న రివాల్వర్ రీటా, కన్నివేడి చిత్రాలను పూర్తిచేయడానికి సిద్ధమవుతున్నట్లు తాజా సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment