శ్రీపురం నారాయణి ఆసుపత్రిలో 76 కిడ్నీ ఆపరేషన్లు
వేలూరు: వేలూరు శ్రీపురంలోని బంగారుగుడి ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ నారాయణి ఆసుపత్రిలో 76 కిడ్నీ ఆపరేషన్‌లు చేసి విజయవంతం చేసిన డాక్టర్‌లను ఆసుపత్రి డైరెక్టర్ బాలాజీ అభినందించారు. బంగారుగుడి పీఠాధిపతి శక్తిఅమ్మ ఆశీస్సులతో నడుస్తున్న ఈ ఆసుపత్రిలో రక్త సంబంధించిన 66 మంది వద్ద కిడ్నీలు దానంగా తీసుకొని, బ్రెయిన్ డెత్ అయిన వారు దానం చేసిన పది మంది కిడ్నీలు సహా మొత్తం 76 కిడ్నీ ఆపరేషన్‌లు చేసి డాక్టర్‌లు శివానందం, మనీష్‌కుమార్, కార్తికేయన్, ఎయిల్ నిలవన్, గంగ ప్రతిభ చాటారు. ఈనేపథ్యంలో ఆసుపత్రి డైరెక్టర్ బాలాజీ జ్ఞాపికలను అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆసుపత్రిలో మొదట పది కిడ్నీ ఆపరేషన్‌లను పూర్తిగా ఉచితంగా చేయడం జరిగిందన్నారు. అనంతరం రాష్ట్ర ఆరోగ్యశ్రీ పథకం కింద పలువురికి ఆపరేషన్ చేసి సాధన చేయడం జరిగిందన్నారు. ఇతర దేశాల నుంచి వేలూరుకు వస్తున్న శ్రీ శక్తి అమ్మ భక్తులు ఆసుపత్రిలో రోగులకు అందజేస్తున్న చికిత్స చూసి పలువురు అభినందించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అవయవాల మార్పిడి డాక్టర్ షణ్ముగ సుందరం, వైద్య బృందం కలుసుకున్నారు. అనంతరం వైద్య బృందాన్ని పీఠాధిపతి శక్తి అమ్మ అభినందించి ఆశీస్సులను అందజేశారు.
వైద్యులను అభినందిస్తున్న ఆసుపత్రి డైరెక్టర్ బాలాజీ
Comments
Please login to add a commentAdd a comment