ప్రభుత్వ ఆదేశాలు పట్టించుకోని రిజిస్ట్రార్ కార్యాలయ సి
తిరుత్తణి: ఆదివారం శుభముహూర్త దినం సందర్భంగా అనేక మంది రిజిస్ట్రేషన్ చేసే ఆవకాశం వున్నందున రిజిస్ట్రార్ కార్యాలయాలు తెరిచి రిజిస్ట్రేషన్లు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో అనేక మంది శుభదినం సందర్భంగా రిజిస్ట్రేషన్ కోసం ఆసక్తి చూపారు. ఇందుకోసం తిరుత్తణిలోని సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద ఆదివారం ఉదయానికి చేరుకున్నారు. అయితే ఉదయం 10 గంటలు దాటినా రిజిస్ట్రార్‌తో పాటూ సిబ్బంది విధులకు హాజరు కాకపోవడంతో కార్యాలయం తాళం వేసి వుంచడంతో మధ్యాహ్నం 12 గంటల వరకు వేచివుండి నిరాశతో వెనుతిరిగారు. ఇదే విధంగా పళ్లిపట్టు, ఆర్కేపేట, తిరువలంగాడు ప్రాంతాల్లోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు తెరుచుకోకపోవడంతో రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన ఆశావహులు నిరాశతో వెనుతిరిగారు. ప్రభుత్వ ఆదేశాలు రిజిస్ట్రేషన్ శాఖ సిబ్బంది పట్టించుకోక పోవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment