14న బేబీ అండ్ బేబీ
తమిళసినిమా: యువరాజ్ ఫిలిమ్స్ పతాకంపై బి.యువరాజ్ నిర్మించిన చిత్రం బేబీ అండ్ బేబీ. ఈ చిత్రం ద్వారా ప్రతాప్ అనే నవ దర్శకుడు పరిచయం అవుతున్నారు. సత్యరాజ్, జయ్, ప్రగ్యా, యోగిబాబు ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రానికి డి.ఇమాన్ సంగీతాన్ని అందించారు. అన్ని వర్గాలను అలరించే విధంగా రూపొందిన వినోదంతో కూడిన ఫ్యామిలీ ఎంటర్‌టెయినర్ చిత్రం ఇది. ఈ చిత్రం ప్రేమికుల రోజు సందర్భంగా ఈనెల 14న తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా శనివారం సాయంత్రం నిర్వహించిన ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో సత్యరాజ్, జయ్, యోగిబాబు, యూనిట్ వర్గాలు పాల్గొన్నాయి. యువరాజ్ మాట్లాడుతూ తనది సినిమా వృత్తి కాదని అయితే సినిమా అంటే చిన్నతనం నుంచి ఆసక్తి అని చెప్పారు. దర్శకుడు ప్రతాప్ చెప్పిన కథ నచ్చడంతో వెంటనే ఈ చిత్రాన్ని నిర్మించడానికి సిద్ధమైనట్లు చెప్పారు. ఇందులో పనిచేసిన అందరికీ ధన్యవాదాలు అన్నారు. ఒక మంచి చిత్రాన్ని తమిళ చిత్రపరిశ్రమకు అందించామన్న సంతృప్తి కలిగిందన్నారు. అద్భుతమైన సంగీతాన్ని అందించారని ఆయనకు ఈ చిత్రం ద్వారా ఇసైవళ్లల్ అనే బిరుదు ఇచ్చినట్లు చెప్పారు. యోగి బాబు మాట్లాడుతూ ఈ చిత్ర దర్శకుడు ప్రతాప్ తాను 17 ఏళ్ల క్రితం ఓ చిత్రంలో జూనియర్ ఆర్టిస్టులుగా నటించామన్నారు. ఇప్పుడు తాను మీరందరూ చెబుతున్న హాస్యనటుడిని అయ్యానని ప్రతాప్ దర్శకుడు అయ్యారని, మనం అంకితభావంతో శ్రమిస్తే ఫలితం ఖచ్చితంగా ఉంటుందని యోగి బాబు పేర్కొన్నారు. ఈ చిత్రంలో నటించడం మంచి అనుభవం అని ఆయన అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment