బీఆర్‌ఎస్ సమావేశానికి హాజరైన వారిపై చర్యలు
సస్పెన్షన్ విధిస్తూ సిద్దిపేట కలెక్టర్ మను చౌదరి ఉత్తర్వులు
సిద్దిపేట రూరల్: లోక్‌సభ ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తూ బీఆర్‌ఎస్ నిర్వహించిన సమావేశంలో పాల్గొ న్న 106 మంది ప్రభుత్వ ఉద్యోగు లపై వేటు పడింది. మంగళవారం సిద్దిపేట జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి మిక్కిలినేని మను చౌదరి వారిపై సస్పెన్షన్ విధిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ఆదివారం రాత్రి సమయంలో బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రాంరెడ్డి ఎన్నికల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని రెడ్డి సంక్షేమ భవనంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూ 106 మంది సెర్ప్, ఉపాధి హామీ అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ విష యం తెలుసుకున్న బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఎన్నికల కమిషన్‌కు, కలెక్ట ర్‌కు ఫిర్యాదు చేశారు. ఫంక్షన్ హాల్‌లోని సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా సమావేశంలో పాల్గొన్న 106 మందిని గుర్తించారు. ఈ నివేదికను ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ ఇన్‌చార్జి.. కలెక్టర్‌కు అందజేశారు. ఇందులో సెర్ప్ ఉద్యో గులు 38 మంది, ఈజీఎస్ అధికారులు 68 మందిపై శాఖా పరమైన చర్యల్లో భాగంగా సస్పెన్షన్ వేటు వేశారు. సోమవారం బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రాంరెడ్డి, స్థానిక నాయకులపై కేసు నమోదు కావడం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment