Updates..
►కవితపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్న ఈడీ..
- లిక్కర్ కేసులో కవిత పాత్ర, వాటాపై విచారణ
- లిక్కర్ స్కాంలో హవాలా రూపంలో ఆప్‌కు డబ్బు ఎలా చేరిందన్న అంశంపై విచారణ.
- సౌత్ గ్రూప్‌లు ఢిల్లీ సీఎం, మంత్రులు కవితతో ఎక్కడ చర్చలు జరిగాయి?.
- ఎలా చర్చలు జరిగాయన్నదానిపై విచారణ.
- లిక్కర్ కేసులో వీరిందరి పాత్రలపై తమ వద్ద ఆధారాలు ఉన్నాయంటున్న ఈడీ
► ఈడీ విచారణకు కేజ్రీవాల్ ఇవాళ కూడా డుమ్మా
- నేటి ఈడీ విచారణకు ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ డుమ్మా
- అత్యవసరంగా ఢిల్లీ హైకోర్టులో మరో పిటిషన్
- ఈడీ అరెస్ట్ చేయకుండా ఆదేశాలివ్వాలని అభ్యర్థన
- కోర్టు రక్షణ కల్పిస్తేనే ఈడీ విచారణకు హాజరు అవుతానని స్పష్టీకరణ
- విచారణ జరుపుతున్న డివిజన్ బెంచ్
- ఇప్పటికే తొమ్మిది సార్లు సమన్లు జారీ చేసిన ఈడీ
►ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐదో రోజు కవితను ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. ఇక, నేడు కవితను.. ఆమె తల్లి కల్వకుంట్ల శోభ, కవిత కుమారుడు కలువనున్నారు.
►ఇక, లిక్కర్ స్కాంకు సంబంధించి నిన్న(బుధవారం) రాత్రి వరకు కవిత పీఏలు రాజేష్, రోహిత్‌లను ఈడీ అధికారులు విచారించారు. ఇప్పటి వరకు సీజ్ చేసిన ఫోన్ల లాక్ తీయించి అందులోని సమాచారం ఆధారంగా ఈడీ అధికారులు ప్రశ్నలు అడిగారు.
►మరోవైపు.. లిక్కర్ కేసులో విచారణ కోసం ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను నేడు విచారణకు రావాలని ఈడీ అధికారులు పిలిచారు. ఈ క్రమంలో ఈడీ సమన్లు రాజ్యాంగ విరుద్ధమని ఇప్పటికే కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో, కేజ్రీవాల్ ఈరోజు కూడా ఈడీ విచారణకు రావాడం అనుమానమే.
Comments
Please login to add a commentAdd a comment