సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో వరదల నేపథ్యంలో పరిస్థితిని తక్షణమే అంచనా వేసేందుకు అమిత్‌షా ఆదేశాల మేరకు అంతర్–మంత్రిత్వ శాఖల కేంద్ర బృందాన్ని కేంద్ర హోంశాఖ నియమించింది. ఎనిమిది శాఖల అధికారులతో కేంద్ర బృందం రానుంది.
ఎన్‌డీఎంఏ సలహాదారు కునాల్ సత్యార్థి నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల కమిటీ ఈ నెల 31 నుంచి రాష్ట్రంలో పర్యటించనుంది. ఎనిమిది శాఖల అధికారులతో కేంద్ర బృందం రానుంది. క్షేత్రస్థాయిలో నష్టాలను కేంద్ర బృందం అంచనా వేసిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం వివరణాత్మక నివేదిక కేంద్రానికి సమర్పిస్తుంది. అనంతరం అవసరమైతే కేంద్ర బృందం మరోసారి క్షేత్రస్థాయిలో పర్యటించి నివేదికను కేంద్ర హోంశాఖకు సమర్పిస్తుంది.
కేంద్ర బృందంలో వ్యవసాయ, ఆర్థిక, జలశక్తి, విద్యుత్, రహదారుల శాఖలు, అంతరిక్ష విభాగంలోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్‌కు చెందిన అధికారులు ఉంటారు. తెలంగాణలో 2019–20, 2020–21, 2021–22, 2022–23 సంవత్సరాల్లో సంబంధిత మంత్రిత్వ శాఖలు అమలు చేసిన వివిధ పథకాలు, కార్యక్రమాల కింద చేసిన కేటాయింపులు, నిధుల విడుదల, ఖర్చుల వివరాలను కూడా కేంద్ర బృందానికి ఇవ్వాలని సంబంధిత శాఖలను కేంద్ర హోంశాఖ ఆదేశించింది.
ఇది కూడా చదవండి: ట్యాంక్ బండ్‌పై కారు బీభత్సం.. హుస్సేన్ సాగర్‌లోకి దూసుకెళ్లి..
Comments
Please login to add a commentAdd a comment